హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Counseling: CBSE విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి సైకలాజికల్ కౌన్సెలింగ్ ప్రారంభం..

CBSE Counseling: CBSE విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి సైకలాజికల్ కౌన్సెలింగ్ ప్రారంభం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు శుభవార్త. రేపటి నుండి అంటే 09 జనవరి 2023 నుండి బోర్డు ద్వారా సైకలాజికల్ కౌన్సెలింగ్ సౌకర్యం ప్రారంభం కానుంది. ముందుగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు కౌన్సెలింగ్‌ను ముందస్తుగా వాయిదా వేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు శుభవార్త. రేపటి నుండి అంటే 09 జనవరి 2023 నుండి బోర్డు ద్వారా సైకలాజికల్ కౌన్సెలింగ్ సౌకర్యం ప్రారంభం కానుంది. ముందుగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు కౌన్సెలింగ్‌ను ముందస్తుగా వాయిదా వేశారు. ఈ మేరకు బోర్డు నుంచి సమాచారం అందింది. CBSE అందించిన ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే విద్యార్థులు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు. దీనికి సంబంధించి జారీ చేసిన నోటీసులో.. కోవిడ్ మహమ్మారి తర్వాత సిబిఎస్‌ఇ 10 మరియు 12వ తరగతి పరీక్షలు ఫిజికల్ మోడ్‌లో నిర్వహించడం ఇదే మొదటిసారి అని CBSE పేర్కొంది. సుమారు రెండేళ్ల విరామం తర్వాత విద్యార్థులు రాత పరీక్షను రాయనున్నారు. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు బోర్డు ఇప్పటికే నమూనా పత్రాలను విడుదల చేసింది. పరీక్ష సరళి, మార్కుల పంపిణీని కూడా వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది.

వీటన్నింటితో పాటు విద్యార్థులకు సైకలాజికల్ కౌన్సెలింగ్ ఇచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తామని బోర్డు నోటీసులో పేర్కొంది. ఈ సదుపాయం ఇంతకు ముందు ఫిబ్రవరిలో ప్రారంభించబడేది.. కానీ ఇప్పుడు ఇది జనవరి నెలలో ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఈ సౌకర్యాన్ని పొందడానికి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఈ నంబర్‌కు 1800-11-8004 . డయల్ చేయవచ్చు . ఇది ఉచిత IVRS సౌకర్యం.. 24x7 అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు.. CBSE ఉచిత టెలి-కౌన్సెలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. దీని కోసం విద్యార్థులు ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.30 గంటల మధ్య.. పైన పేర్కొన్న నంబర్‌లో మాత్రమే సంప్రదించాలి. పరీక్షలో ఒత్తిడికి గురికాకుండా ఎలా ఉండాలి.

TSPSC 9 Notifications: టీఎస్సీఎస్సీ నుంచి 9 నోటిఫికేషన్లు.. దరఖాస్తుల తేదీల వివరాలిలా..

పరీక్షలో ఎలాంటి భయం లేకుండా.. పరీక్షను ఎలా రాయలి.. పరీక్షకు ఎలా సన్నద్ధమవ్వాలి అనే సమాచారం ఈ కౌన్సెలింగ్ లో ఇవ్వబడుతుంది. ఒత్తిడి ఎలా జయించాలనే విషయాలను చాలా మంది విద్యార్థులకు అడిగే ప్రశ్న.. వాటికి సమాధానం ఈ కార్యక్రమంలో దొరకనుంది. దీనితో పాటు.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను చెప్పనున్నారు. CBSE కార్యాలయం యొక్క ముఖ్యమైన సంప్రదింపు వివరాలు మొదలైనవి హిందీ మరియు ఆంగ్లంలో చూడవచ్చు. ఇది దేశంలోని ఏ ప్రాంతం నుండి అయినా యాక్సెస్ చేయవచ్చు.

First published:

Tags: Career and Courses, CBSE, JOBS

ఉత్తమ కథలు