హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE: 10, 12వ తరగతుల ప్రాక్టీస్ పేపర్లను రిలీజ్ చేసిన సీబీఎస్ఈ.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

CBSE: 10, 12వ తరగతుల ప్రాక్టీస్ పేపర్లను రిలీజ్ చేసిన సీబీఎస్ఈ.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CBSE: సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు ఈనెల 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు సబ్జెక్ కోడ్, పేరు, థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు, వాటి మార్కులు, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు సంబంధించి స్పష్టమైన అవగాహన ఉండి ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఫిబ్రవరి నెల వచ్చేసింది. అన్నిచోట్లా ఎగ్జామ్ ఫీవర్ (Exam Fever) మొదలైంది. స్కూల్స్‌లో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ఇంటి దగ్గర కూడా పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. విద్యార్థి దశలో 10వ తరగతి, కెరియర్‌ ఎంచుకునే క్రమంలో 12వ తరగతి చాలా ముఖ్యం. ఈ పరీక్షల్లో ఎంత బాగా ప్రతిభ కనబరిస్తే అంత మంచి అవకాశాలు ఉంటాయి. సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు ఈనెల 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు సబ్జెక్ కోడ్, పేరు, థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు, వాటి మార్కులు, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు సంబంధించి స్పష్టమైన అవగాహన ఉండి ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో జరగనున్న పరీక్షలపై కూడా సరైన అవగాహన ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

* అవగాహన కల్పించేందుకు చర్యలు

విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు, వారిలో పరీక్ష భయం పోగొట్టేందుకు సీబీఎస్ఈ బోర్డ్ తన అధికారిక వెబ్‌సైట్‌ cbsecademic.nicలో నమూనా ప్రశ్నపత్రాలను ఉంచింది. వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, సమాధానాలు ఎలా రాయాలి ఏయే కేటగిరీలు నుంచి ఎన్ని మార్కులు రావచ్చు అనేది తెలుస్తుంది. ఎగ్జామ్ టెన్షన్ పోతుంది. సమయపాలన కూడా తెలుస్తుంది.

* 10వ తరగతి షెడ్యూల్

సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై మార్చి 21తో ముగియనున్నాయి. ఉదయం 10.30కు మొదలై మధ్యాహ్నం 01.30 వరకు జరుగుతాయి. కొన్ని పరీక్షలు 12.30తోనే ముగుస్తాయి. మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది.

* 12వ తరగతి షెడ్యూల్

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15తో మొదలై ఏప్రిల్ 5తో ముగుస్తాయి. వీరికి కూడా ఉదయం 10:30కు మొదలై మధ్యాహ్నం 12:30తో లేదా 1:30తో పూర్తవుతాయి.

ఇది కూడా చదవండి : NEET UG 2023: ఈ ఏడాదికి ఇంతే.. నీట్ షెడ్యూల్‌లో మార్పు లేదు.. NTA లేటెస్ట్‌ అప్‌డేట్‌!

* అందుబాటులో నమూనా ప్రశ్నాపత్రాలు

CBSE 10 మరియు 12 తరగతుల బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డులను త్వరలో విడుదల చేయనుంది. పరీక్షలకు సంబంధించిన సకాలంలో అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు బోర్డు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. పదో తరగతికి సంబంధించి సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ క్వశ్చన్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి. 12వ తరగతికి సంబంధించి మ్యాథ్స్, అకౌంటెన్సీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఇంగ్లీష్ కోర్, హిందీ సబ్జెక్టులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి.

* ప్రాక్టీస్ పేపర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా?

సీబీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ cbseacademic.nic.in లోకి వెళ్లాలి. హోమ్‌పేజీలో 'క్వశ్చన్ బ్యాంక్' (Question Bank) అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. అందులో 'అదనపు అభ్యాస ప్రశ్నలు' (Additional Practice Questions’ అనే లింక్‌ క్లిక్ చేయాలి. అందులో వేర్వేరుగా పది, 12వ తరగతులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు పీడీఎఫ్ (PDF) రూపంలో ఉంటాయి. వాటిలో సబ్జెక్టుల వారీగా మీకు కావాల్సిన క్వశ్చన్ పేపర్ లింక్స్‌పై క్లిక్ చేసి పీడీఎఫ్ రూపంలో ప్రశ్నాపత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

First published:

Tags: Career and Courses, CBSE, Cbse exams, EDUCATION

ఉత్తమ కథలు