CBSE Career Guidance: ఆన్‌లైన్ కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ పోర్టల్‌ను ప్రారంభించిన సీబీఎస్ఈ

CBSE Career Guidance: ఆన్‌లైన్ కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ పోర్టల్‌ను ప్రారంభించిన సీబీఎస్ఈ (ప్రతీకాత్మక చిత్రం)

CBSE Career Guidance | సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్. కెరీర్‌ను చక్కగా తీర్చిదిద్దుకోవడానికి ఎలాంటి కోర్సులు చేయాలో తెలిపేందుకు సీబీఎస్ఈ కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది.

  • Share this:
ఉన్నత విద్య విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. ఏ కోర్సులో చేరితే భవిష్యత్తు బాగుంటుందనే వివరాలు వారికి పాఠశాల స్థాయిలో తెలియట్లేదు. ఈ విషయంపై దృష్టి సారించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- CBSE. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ పోర్టల్‌ను సంస్థ ప్రారంభించింది. ఇందుకు యూనిసెఫ్ సహకారం తీసుకుంది. విద్యార్థులకు అన్ని విషయాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్, టెక్నికల్ పార్ట్నర్ ఐడ్రీమ్ కెరీర్ సాయంతో కెరీర్ గైడెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు CBSE చైర్మన్ మనోజ్ అహుజా. మరిన్ని వివరాలను అధికారిక వెబ్‌సైట్ అయిన cbse.gov.in నుంచి పొందవచ్చని సూచించారు.

Railway Jobs: భారతీయ రైల్వేలో 1664 జాబ్స్... మొదలైన దరఖాస్తు ప్రక్రియ

Railway Jobs: రూ.92,300 వరకు వేతనంతో రైల్వే ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తాజాగా ప్రకటించిన ఈ కెరీర్ పోర్టల్‌ను.. CBSE ప్రధాన వెబ్‌సైట్‌కి లింక్ చేస్తారు. CBSE స్కూల్ విద్యార్థులందరూ వారి వివరాలతో పోర్టల్‌లో సైన్ అప్ చేసుకొని, కెరీర్ గైడెన్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. కొత్త విద్యా విధానం (NEP- 2020) ద్వారా విద్యా వ్యవస్థను శక్తిమంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అన్ని అనుబంధ పాఠశాలల్లో కెరీర్ గైడెన్స్ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని CBSE నిర్ణయించింది. ఇందుకు డిజిటల్ ట్రైనింగ్ సెషన్ ద్వారా ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు పోర్టల్‌లో శిక్షణ ఇస్తారు. టీచర్లకు అదనంగా 90 గంటల సెల్ఫ్-పేస్ ఆన్‌లైన్ శిక్షణ కోర్సు సైతం ఉంటుంది.

Jobs: భారతీయ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

NTPC Recruitment 2021: రూ.70,000 పైగా జీతంతో ఎన్‌టీపీసీలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

CBSE కెరీర్ గైడెన్స్ పోర్టల్ ప్రత్యేకతలు


బాలబాలికలకు విద్య, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వివరాలను ఈ పోర్టల్‌లో ప్రత్యేకంగా పొందుపరిచారు. స్పెషల్ స్టూడెంట్స్ (అంగవైకల్యం ఉన్నవారు) కోసం కెరీర్ ఆప్షన్‌లను సైతం పోర్టల్ తెలియజేస్తుంది. విద్యార్థులను ఈ వ్యవహారాల్లో నిమగ్నం చేయడానికి గేమిఫైడ్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సుల కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్‌ను అందిస్తారు. ఈ పోర్టల్‌ను మొబైల్, టాబ్లెట్, ల్యాప్‌టాప్‌ల ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.

ఈ సేవలను విద్యార్థులకు ఉచితంగా అందించనున్నారు. ప్రస్తుతం ప్రతి విద్యార్థి 560 కంటే ఎక్కువ కెరీర్‌ ఆప్షన్‌లను ఇంగ్లీష్, హిందీతో పాటు ఎనిమిది ఇతర భాషల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. 25,000 కళాశాలలు, ఒకేషనల్ ఇనిస్టిట్యూట్‌లలో అందించే మూడు లక్షల కోర్సులు, 1200 స్కాలర్‌షిప్‌లు, 1150 ప్రవేశ పరీక్షల వివరాల గురించి విద్యార్థులు తెలుసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published: