Home /News /jobs /

CENTRAL BOARD OF SECONDARY EDUCATION INVITES APPLICATIONS FOR 357 GROUP A B C POSTS APPLY BEFORE DECEMBER 16 SS

CBSE Jobs: సీబీఎస్ఈలో 357 జాబ్స్... రేపే లాస్ట్ డేట్

CBSE Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... సీబీఎస్ఈలో 357 ఉద్యోగాలు
(ప్రతీకాత్మక చిత్రం)

CBSE Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... సీబీఎస్ఈలో 357 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

CBSE Recruitment 2019 | దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు cbse.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 357 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పాసైనవారు తమ అర్హతలకు తగ్గ పోస్టుకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు cbse.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది సీబీఎస్ఈ. పోస్టును బట్టి రూ.39,100 వరకు వేతనం ఉంటుంది.

    CBSE Recruitment 2019: ఖాళీల వివరాలివే...


    గ్రూప్ ఏ- 35
    అసిస్టెంట్ సెక్రెటరీ- 14
    అనలిస్ట్ (ఐటీ)- 14
    అసిస్టెంట్ సెక్రెటరీ (ఐటీ)- 7

    గ్రూప్ బీ- 8
    జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 8

    గ్రూప్ సీ- 314
    జూనియర్ అసిస్టెంట్- 204
    సీనియర్ అసిస్టెంట్- 60
    స్టెనోగ్రాఫరీ- 25
    జూనియర్ అకౌంటెంట్- 19
    అకౌంటెంట్- 6

    CBSE Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 15
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 16
    దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గ్రూప్ ఏ పోస్టుకు రూ.1500, గ్రూప్ బీ పోస్టుకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, రెగ్యూలర్ సీబీఎస్ఈ ఉద్యోగులకు ఫీజు లేదు.
    విద్యార్హత- పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ లాంటి అర్హతలున్నాయి.
    సీబీఎస్ఈ విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    RRB NTPC Exam Date: మార్చి 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్... సోషల్ మీడియాలో ఫేక్ నోటీస్

    DRDO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... టెన్త్ పాసైనవారికి డీఆర్‌డీఓలో 1817 ఉద్యోగాలు

    Job Mela: రేపే హైదరాబాద్‌లో జాబ్ మేళా... రిజిస్ట్రేషన్ చేయండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, CBSE, Exams, Job notification, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు