Home /News /jobs /

CENTRAL BOARD OF SECONDARY EDUCATION CBSE MERIT SCHOLARSHIP SCHEME FOR SINGLE GIRL CHILD FOR PLUS 2 STUDIES 2019 KNOW DETAILS SS

CBSE Scholarship: 10వ తరగతి పాసైన అమ్మాయిలకు సీబీఎస్ఈ స్కాలర్‌షిప్స్... నిబంధనలివే

CBSE Scholarship: 10వ తరగతి పాసైన అమ్మాయిలకు సీబీఎస్ఈ స్కాలర్‌షిప్స్... నిబంధనలివే
(ప్రతీకాత్మక చిత్రం)

CBSE Scholarship: 10వ తరగతి పాసైన అమ్మాయిలకు సీబీఎస్ఈ స్కాలర్‌షిప్స్... నిబంధనలివే (ప్రతీకాత్మక చిత్రం)

CBSE Scholarship | ఈ స్కాలర్‌షిప్స్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 18 చివరి తేదీ.

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE స్కాలర్‌‌షిప్ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. 'సీబీఎస్ఈ మెరిట్ స్కాలర్‌షిప్ ఫర్ సింగిల్ గాళ్ చైల్డ్ ఫర్ ప్లస్ 2 స్టడీస్-2019' పేరుతో ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది సీబీఎస్ఈ. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్స్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు అప్లై చేయొచ్చు. దరఖాస్తుకు అక్టోబర్ 18 చివరి తేదీ. స్కాలర్‌షిప్స్ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి సీబీఎస్ఈ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    CBSE Scholarship: అర్హతలు ఇవే...


    2019లో సీబీఎస్ఈ 10వ తరగతి 60 శాతం మార్కులతో పాసై, 11వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నవాళ్లు దరఖాస్తు చేయాలి.
    విద్యాసంవత్సరంలో మంత్లీ ఫీజు రూ.1,500 లోపు ఉన్నవాళ్లే స్కాలర్‌షిప్‌కు అప్లై చేయాలి.
    సింగిల్ గాళ్ చైల్డ్ అంటే తల్లిదండ్రులకు ఒక కూతురై ఉండాలి. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు ఉండకూడదు.
    రెన్యువల్ చేసేవాళ్లు వేరుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
    రెన్యువల్ దరఖాస్తు హార్డ్ కాపీని నవంబర్ 15 లోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
    కేవలం భారతీయ విద్యార్థులు మాత్రమే స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేయాలి.

    ప్రపంచంలోనే తొలి పాప్ అప్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Jobs: గ్రామ సచివాలయంలో జాబ్ రాలేదా? ఈ 30,000 ఉద్యోగాలకు ట్రై చేయండి

    RITES Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి
    First published:

    Tags: CBSE, EDUCATION, Scholarship

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు