Home /News /jobs /

CENTRAL BOARD OF SECONDARY EDUCATION CBSE INVITES APPLICATIONS FOR 357 POSTS APPLY BEFORE DECEMBER 23 SS

CBSE Jobs: సీబీఎస్ఈలో 357 జాబ్స్... డిసెంబర్ 23 లాస్ట్ డేట్

CBSE Jobs: సీబీఎస్ఈలో 357 జాబ్స్... డిసెంబర్ 23 లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)

CBSE Jobs: సీబీఎస్ఈలో 357 జాబ్స్... డిసెంబర్ 23 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

CBSE Recruitment 2019 | ఆసక్తి గల అభ్యర్థులు cbse.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది సీబీఎస్ఈ. పోస్టును బట్టి రూ.39,100 వరకు వేతనం ఉంటుంది.

    సీబీఎస్ఈలో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఇంకో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 357 ఖాళీలను భర్తీ చేస్తోంది సీబీఎస్ఈ. కొద్ది రోజుల క్రితం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 357 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి దరఖాస్తు గడువు డిసెంబర్ 16న ముగిసింది. అయితే దరఖాస్తు చేయనివారికి మరో అవకాశాన్ని ఇచ్చేందుకు గడువును పొడిగించింది సీబీఎస్ఈ. అప్లై చేయనివారు డిసెంబర్ 23 వరకు అప్లై చేయొచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పాసైనవారు తమ అర్హతలకు తగ్గ పోస్టుకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు cbse.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది సీబీఎస్ఈ. పోస్టును బట్టి రూ.39,100 వరకు వేతనం ఉంటుంది.

    CBSE Recruitment 2019: ఖాళీల వివరాలివే...


    గ్రూప్ ఏ- 35
    అసిస్టెంట్ సెక్రెటరీ- 14
    అనలిస్ట్ (ఐటీ)- 14
    అసిస్టెంట్ సెక్రెటరీ (ఐటీ)- 7

    గ్రూప్ బీ- 8
    జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 8

    గ్రూప్ సీ- 314
    జూనియర్ అసిస్టెంట్- 204
    సీనియర్ అసిస్టెంట్- 60
    స్టెనోగ్రాఫరీ- 25
    జూనియర్ అకౌంటెంట్- 19
    అకౌంటెంట్- 6

    CBSE Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 15
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 23
    దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గ్రూప్ ఏ పోస్టుకు రూ.1500, గ్రూప్ బీ పోస్టుకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, రెగ్యూలర్ సీబీఎస్ఈ ఉద్యోగులకు ఫీజు లేదు.
    విద్యార్హత- పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ లాంటి అర్హతలున్నాయి.
    సీబీఎస్ఈ విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు గడువును పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Google Jobs 2020: గూగుల్‌లో ఉద్యోగాల జాతర... త్వరలో ఇండియాలో 3,800 పోస్టుల భర్తీ

    Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు పలు నోటిఫికేషన్లు... మొత్తం 7564 జాబ్స్

    IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, CBSE, Exams, Job notification, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు