హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Central Bank of India Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ బ్యాంక్ లో జాబ్స్.. వివరాలివే

Central Bank of India Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ బ్యాంక్ లో జాబ్స్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు డిసెంబర్ 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో (Notification) స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు జనవరి 22న ఆన్లైన్ ఎగ్జామ్ (Exam) నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 11 నుంచి అందించనున్నారు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

S.Noపోస్టుఖాళీలు
1.ఎకనామిస్ట్1
2.ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ 1
3.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ1
4.డేటా సైంటిస్ట్1
5.క్రెడిట్ ఆఫీసర్10
6.డేటా ఇంజనీర్11
7.IT సెక్యూరిటీ అనలిస్ట్1
8.IT Soc అనలిస్ట్2
9.రిస్క్ మేనేజర్5
10.టెక్నికల్ ఆఫీసర్(క్రెడిట్)5
11.ఫైనాన్షియల్ అనలిస్ట్20
12.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ15
13.లా ఆఫీసర్20
14.రిస్క్ మేనేజర్10
15.. సెక్యూరిటీ II3
16.సెక్యూరిటీ I1


విద్యార్హతల వివరాలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, మాస్టర్ డిగ్రీ, సీఏ, సీఎఫ్ఏ, పీహెచ్డీ చేసిన అభ్యర్థులు ఆయా పోస్టులకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

NTPC Recruitment 2021: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. రూ. 60 వేల వేతనంతో NTPCలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు ఫీజుగా రూ. 850ని నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IBPS Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 1828 జాబ్స్... ఏం చదవాలంటే


ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: నవంబర్ 23

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ: డిసెంబర్ 17

అడ్మిట్ కార్డులు విడుదల: జనవరి 11

పరీక్ష తేదీ: జనవరి 22

Sainik School Recruitment 2021: సైనిక్ స్కూల్ లో రూ.44 వేల వేతనంతో ఉద్యోగాలు..ఇలా అప్లై చేయండి

దరఖాస్తు ఎలా అంటే..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నంబర్ 23న ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఆ తేదీ నుంచి www.centralbankofindia.co.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

First published:

Tags: Bank Jobs, Bank Jobs 2021, Central Bank of India, Job notification, JOBS, Private Jobs