CENTRAL BANK OF INDIA RECRUITMENT 2021 APPLICATION PROCESS ENDS SOON FOR 214 SPECIALIST OFFICER POSTS KNOW HOW TO APPLY SS
Central Bank Jobs 2021: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 జాబ్స్... ఇలా అప్లై చేయండి
Central Bank Jobs 2021: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 జాబ్స్... ఇలా అప్లై చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
Central Bank of India Recruitment 2021 | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officer) పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది గతంలో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులతో విడుదల జాబ్ నోటిఫికేషన్ (Job Notification) గడువు 2021 డిసెంబర్ 17న ముగిసింది. అయితే స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్యను 214 కి పెంచుతూ సవరించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు గడువును 2021 డిసెంబర్ 30 వరకు పెంచింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతల వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ పోస్టులకు ఎలా అప్లై ఇక్కడ తెలుసుకోండి.
Central Bank of India Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
Step 4- మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.
Step 5- మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
Step 6- రెండో దశలో ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
Step 7- మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
Step 8- నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.
Step 9- ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి.
Step 10- ఆరో దశలో జనరల్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.175 ఫీజు చెల్లించాలి.
Step 11- అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
అభ్యర్థులు 2021 డిసెంబర్ 30 లోగా అప్లై చేయాలి. 2022 జనవరి 11 నుంచి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2022 జనవరి 22న ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.