బ్యాంకు ఉద్యోగం మీ కలా? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) వేర్వేరు విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా మొత్తం 115 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు 2021 నవంబర్ 23న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 17 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్లో విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. విద్యార్హతలతో పాటు అనుభవం కూడా తప్పనిసరి. ఎంపికైనవారికి రెండేళ్ల ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో పాటు విద్యార్హతల గురించి తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 115 | విద్యార్హతలు | వయస్సు |
ఎకనమిస్ట్ | 1 | ఎకనమిక్స్, బ్యాంకింగ్, కామర్స్, ఎకనమిక్ పాలసీ, పబ్లిక్ పాలసీలో పీహెచ్డీ పాస్ కావాలి. | 30 నుంచి 45 ఏళ్లు |
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ | 1 | చార్టర్డ్ అకౌంటెంట్ పాస్ కావాలి. | 35 నుంచి 45 ఏళ్లు |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | 1 | కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ టెక్నాలజీస్‌లో ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. లేదా ఎంసీఏ పాస్ కావాలి. | 35 నుంచి 50 ఏళ్లు |
డేటా సైంటిస్ట్ | 1 | స్టాటిస్టిక్స్, ఎకనమెట్రిక్స్, మ్యాథమెటిక్స్, ఫైనాన్స్, ఎకనమిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో పీజీ లేదా కంప్యూటర్ సైన్స్, ఐటీలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. | 28 నుంచి 35 ఏళ్లు |
క్రెడిట్ ఆఫీసర్ | 10 | సీఏ, సీఎఫ్ఏ, ఏసీఎంఏ, ఎంబీఏ ఫైనాన్స్ పాస్ కావాలి. | 26 నుంచి 34 ఏళ్లు |
డేటా ఇంజనీర్ | 11 | స్టాటిస్టిక్స్, ఎకనమెట్రిక్స్, మ్యాథమెటిక్స్, ఫైనాన్స్, ఎకనమిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో పీజీ లేదా కంప్యూటర్ సైన్స్, ఐటీలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. | 26 నుంచి 35 ఏళ్లు |
ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్ | 1 | కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈలో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంసీఏ, ఎంఎస్సీ ఐటీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ పాస్ కావాలి. | 26 నుంచి 40 ఏళ్లు |
ఐటీ ఎస్ఓసీ అనలిస్ట్ | 2 | ఐటీ, ఈసీఈలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఎంసీఏ, ఎంఎస్సీ ఐటీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ పాస్ కావాలి. | 26 నుంచి 40 ఏళ్లు |
రిస్క్ మేనేజర్ స్కేల్ 3 | 5 | ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్‌లో ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిప్లొమా పాస్ కావాలి. లేదా స్టాటిస్టిక్స్‌లో పీజీ పాస్ కావాలి. | 20 నుంచి 35 ఏళ్లు |
టెక్నికల్ ఆఫీసర్ (క్రెడిట్) | 5 | సివిల్, మెకానికల్, ప్రొడక్షన్, మెటల్లర్జీ, టెక్స్టైల్, కెమికల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. | 26 నుంచి 34 ఏళ్లు |
ఫైనాన్షియల్ అనలిస్ట్ | 20 | ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ICWAI) ఫైనల్ ఎగ్జామ్ పాస్ కావాలి. లేదా ఎంబీఏ ఫైనాన్స్ పాస్ కావాలి. | 20 నుంచి 35 ఏళ్లు |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | 15 | కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఇంజనీరింగ్ డిగ్రీ, లేదా పీజీ పాస్ కావాలి. | 20 నుంచి 35 ఏళ్లు |
లా ఆఫీసర్ | 20 | ఎల్ఎల్బీ పాస్ కావాలి. | 20 నుంచి 35 ఏళ్లు |
రిస్క్ మేనేజర్ స్కేల్ 2 | 10 | బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా పాస్ కావాలి. లేదా స్టాటిస్టిక్స్, మ్యాథ్స్‌లో పీజీ లేదా పీజీ డిప్లొమా పాస్ కావాలి. | 20 నుంచి 35 ఏళ్లు |
సెక్యూరిటీ స్కేల్ 2 | 3 | డిగ్రీ పాస్ కావాలి. | 26 నుంచి 45 ఏళ్లు |
సెక్యూరిటీ స్కేల్ 1 | 9 | డిగ్రీ పాస్ కావాలి. | 26 నుంచి 45 ఏళ్లు |
Post Office Jobs: పోస్ట్ ఆఫీసుల్లో 257 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 17
కాల్‌లెటర్స్ డౌన్లోడ్- 2022 జనవరి 11 నుంచి
ఆన్లైన్ ఎగ్జామినేషన్- 2022 జనవరి 22
దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.175.
ఎంపిక విధానం- ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, CAREER, Central Bank of India, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS