హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Bank Jobs 2023: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ప్రముఖ బ్యాంక్ లో 5000 జాబ్స్.. దరఖాస్తుకు మరో 3 రోజులే ఛాన్స్

Bank Jobs 2023: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ప్రముఖ బ్యాంక్ లో 5000 జాబ్స్.. దరఖాస్తుకు మరో 3 రోజులే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మొత్తం 5 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5000 ఖాళీలను నియమించనుంది.  నోటిఫికేషన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ యొక్క వివిధ శాఖలు/కార్యాలయాల్లో అప్రెంటిస్‌షిప్ కోసం ఖాళీలను ప్రకటించింది.  దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 20 నుంచి ప్రారంభమైంది. అంటే నేటి నుంచి ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా https://www.centralbankofindia.co.in/ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు ఏప్రిల్ 3 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఏప్రిల్ రెండో వారంలో జరగనుంది. అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం అప్రెంటీస్‌ల నియామకాలు జరుగుతున్నాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది.

దరఖాస్తు రుసుము.. 

PWBD అభ్యర్థులు - రూ.400/-+GST

SC/ST అన్ని మహిళా అభ్యర్థులు - రూ.600/-+GST

మిగతా అభ్యర్థులందరూ - రూ. 800/-+GST చెల్లించాల్సి ఉంటుంది.

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలిలా.. 

రాష్ట్రం ఖాళీలు
గుజరాత్342
దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ03
మధ్యప్రదేశ్502
ఛత్తీస్‌గఢ్134
చండీగఢ్43
హర్యానా108
పంజాబ్150
J&K26
హిమాచల్ ప్రదేశ్63
తమిళనాడు100
పుదుచ్చేరి01
కేరళ136
రాజస్థాన్192
ఢిల్లీ141
అస్సాం135
మణిపూర్09
నాగాలాండ్07
అరుణాచల్ ప్రదేశ్08
మిజోరం02
మేఘాలయ08
త్రిపుర04
కర్టాటక70
తెలంగాణ106
ఒడిషా112
పశ్చిమ బెంగాల్362
అండమాన్ మరియు నికోబార్01
సిక్కిం16
యుపి615
జార్ఖండ్46
మహారాష్ట్ర629
బిహార్526
ఉత్తరాఖండ్41
గోవా44
ఆంధ్రప్రదేశ్141

వయోపరిమితి.. అభ్యర్థుల వయస్సు కనీసం 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు పొందుతారు.

 అప్రెంటిస్ జీతం.. 

గ్రామీణ/సెమీ-అర్బన్ శాఖలు - రూ. 10,000 నెలకు చెల్లిస్తారు.

పట్టణ శాఖలు - రూ. 15,000 నెలకు చెల్లిస్తారు.

మెట్రో శాఖలు - రూ. 20,000 నెలకు చెల్లిస్తారు.  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: Bank Jobs, Bank Jobs 2023, JOBS

ఉత్తమ కథలు