హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 110 పోస్టులు ఖాళీ..

Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 110 పోస్టులు ఖాళీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central Bank Of India) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల కోసం, అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ వ్యక్తుల దరఖాస్తులు మాత్రమే ఆమోదించబడతాయని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 28 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమయింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 17 అక్టోబర్ 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Centralbankofindia.co.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీ పోస్టుల వివరాలు..

IT, ఎకనామిస్ట్, డేటా సైంటిస్ట్, రిస్క్ మేనేజర్, IT SOC అనలిస్ట్, IT సెక్యూరిటీ అనలిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ (క్రెడిట్), క్రెడిట్ ఆఫీసర్, డేటా ఇంజనీర్, లా ఆఫీసర్, సెక్యూరిటీ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కింద 110 పోస్టులను భర్తీ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 28 సెప్టెంబర్ 2022

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 17 అక్టోబర్ 2022

ఇంటర్వ్యూ - డిసెంబర్ 2022

ఇంటర్వ్యూ అడ్మిట్ కార్డ్ విడుదల - నవంబర్ 2022

Constable Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 400 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

విద్యార్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. పోస్టులను అనుసరించి వివిధర రకాలు అర్హతలు ఉన్నాయి. డిగ్రీ, పీజీలతో పాటు.. సంబంధిత సబ్జెక్ట్ లో స్పెషలైజేషన్ చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు.

వయో పరిమితి

అభ్యర్థుల యొక్క వయోపరిమితి కూడా పోస్టులను అనుసరించి ఉన్నాయి. ఎక్కువగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లకు అవకాశం ఉంది. మరికొన్ని పోస్టులకు గరిష్ట వయో పరిమితి 50 ఏళ్ల వరకు ఉంది. రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వయో పరిమితి సడలింపు ఉంటుంది.

Top 10 Skills To Get Job: ఉద్యోగ సాధనలో ఉపయోగపడే టాప్ 10 నైపుణ్యాలు ఇవే.. నివేదిక విడుదల చేసిన లింక్డ్‌ఇన్ ..

దరఖాస్తు ఫీజు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు, దరఖాస్తు రుసుము రూ. 850 చెల్లించాలి. అయితే SC, ST, PWBD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 175 రూపాయలు.

ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి ..

- ముందుగా మీరు https://ibpsonline.ibps.in/cbiosep22/ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

-అక్కడ మీరు “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

-ఆ తర్వాత పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలి.

-ఫోటో మరియు సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.

-ఆ తర్వాత అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించి సమర్పించండి.

-భవిష్యత్ అవసరాలకు దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకొని దాచుకోండి.

Published by:Veera Babu
First published:

Tags: Bank Jobs 2022, Career and Courses, JOBS, Jobs in banks

ఉత్తమ కథలు