హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Bank Jobs: రాత పరీక్ష లేకుండానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

Bank Jobs: రాత పరీక్ష లేకుండానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

Bank Jobs: రాత పరీక్ష లేకుండానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

Bank Jobs: రాత పరీక్ష లేకుండానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

బ్యాంక్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రాత పరీక్ష లేకుండానే వివిధ పోస్టుల భర్తీకి ఈ బ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో స్పెషల్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

బ్యాంక్ జాబ్స్‌ (Bank Jobs)కు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India). రాత పరీక్ష లేకుండానే వివిధ పోస్టుల భర్తీకి ఈ బ్యాంకు నోటిఫికేషన్ (Bank Notification) విడుదల చేసింది. దీని ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో స్పెషల్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అనుభవజ్ఞులైన, ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 17, 2022. కాగా, ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ Centralbankofindia.co.in ద్వారా అప్లై చేయవచ్చు.

* ఖాళీ పోస్టులు ఇవే

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్‌తో రిస్క్ మేనేజర్, డేటా ఇంజినీర్, డేటా సైంటిస్ట్, ఎకనమిస్ట్ పోస్టులను భర్తీ చేస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఖాళీల సంఖ్య 110. అప్లై చేసుకున్న వారిలో అర్హులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారికి నవంబర్ నెలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీరు ఎలాంటి రాతపరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల అర్హతను బట్టి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

* అప్లికేషన్ ప్రాసెస్

అభ్యర్థులు ముందు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ centralbankofindia.co.in ఓపెన్ చేసి, హోమ్ పేజీలోని “రిక్రూట్‌మెంట్” ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ‘రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ స్పెషలిస్ట్ కేటగిరీ 2022-23-రెసిడ్యుయల్ వేకెన్సీ ఇన్ వేరియస్ స్ట్రీమ్స్’ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ‘రిజిస్టర్‌’ బటన్‌పై క్లిక్ చేసి అభ్యర్థుల పూర్తి వివరాలు నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. చివరిగా భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.

* అప్లికేషన్ ఫీజు..

ఈ పోస్టులకు అప్లై చేసుకునే SC, ST, PWBD అభ్యర్థులు రూ.175 + జీఎస్టీ(GST) చెల్లించాలి. ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.850 + జీఎస్టీ(GST)గా ఉంది.

* ఎంపిక ప్రక్రియ..

అభ్యర్థుల ఫైనల్ సెలక్షన్ వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆయా కేటగిరీలలోని ఖాళీలను బట్టి ఎనిమిది రెట్లు ఎక్కువగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారిని ఇంటర్వ్యూ చేసి ప్రతిభ కలిగిన వారిని సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకు సెలక్ట్ కావడానికి అర్హత ఒక్కటే సరిపోదు. అనుభవం, ఇతర అంశాలు కూడా కీ రోల్ ప్లే చేస్తాయి.

ఇది కూడా చదవండి : APPSC నుంచి 5 నోటిఫికేషన్లు.. అర్హత, చివరి తేదీ, పోస్టుల వివరాలిలా..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. అలాగే వయోపరిమితి, పే స్కేల్ కూడా పోస్టులను అనుసరించే ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central Bank Of India) విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ చెక్ చేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Bank Jobs, Bank Jobs 2022, JOBS

ఉత్తమ కథలు