హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Central Bank Jobs 2021: సెంట్రల్ బ్యాంకులో 214 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Central Bank Jobs 2021: సెంట్రల్ బ్యాంకులో 214 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Central Bank Jobs 2021: సెంట్రల్ బ్యాంకులో 214 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Central Bank Jobs 2021: సెంట్రల్ బ్యాంకులో 214 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Central Bank of India Recruitment 2021 | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 214 స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officer) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు గడువును పొడిగించింది. ఖాళీల వివరాలు, విద్యార్హతల గురించి తెలుసుకోండి.

బ్యాంకు ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు అలర్ట్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 214 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. గతంలో 115 పోస్టుల్ని ప్రకటించినా... పోస్టుల సంఖ్యను 214 కి పెంచింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 17 చివరి తేదీ అని గతంలోనే ప్రకటించింది. అయితే గడువు ముగియడంతో దరఖాస్తు గడువును పొడిగించింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 30 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, ఖాళీల సంఖ్య, విద్యార్హతల వివరాలు తెలుసుకోండి.

Central Bank of India Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


 మొత్తం ఖాళీలు 214 విద్యార్హతలువయస్సు
 ఐటీ V 1 కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ టెక్నాలజీస్‌లో ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. లేదా ఎంసీఏ పాస్ కావాలి. 35 నుంచి 50 ఏళ్లు
 ఎకనమిస్ట్ V 1 ఎకనమిక్స్, బ్యాంకింగ్, కామర్స్, ఎకనమిక్ పాలసీ, పబ్లిక్ పాలసీలో పీహెచ్‌డీ పాస్ కావాలి. 30 నుంచి 45 ఏళ్లు
 ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ V 1 చార్టర్డ్ అకౌంటెంట్ పాస్ కావాలి. 35 నుంచి 45 ఏళ్లు
 డేటా సైంటిస్ట్ IV 1 స్టాటిస్టిక్స్, ఎకనమెట్రిక్స్, మ్యాథమెటిక్స్, ఫైనాన్స్, ఎకనమిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో పీజీ లేదా కంప్యూటర్ సైన్స్, ఐటీలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. 28 నుంచి 35 ఏళ్లు
 రిస్క్ మేనేజర్ III 5 ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్‌లో ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిప్లొమా పాస్ కావాలి. లేదా స్టాటిస్టిక్స్‌లో పీజీ పాస్ కావాలి. 20 నుంచి 35 ఏళ్లు
 ఐటీ ఎస్ఓసీ అనలిస్ట్ III 2 ఐటీ, ఈసీఈలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఎంసీఏ, ఎంఎస్సీ ఐటీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ పాస్ కావాలి. 26 నుంచి 40 ఏళ్లు
 ఐసీ సెక్యూరిటీ అనలిస్ట్ III 1 కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈలో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంసీఏ, ఎంఎస్సీ ఐటీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ పాస్ కావాలి. 26 నుంచి 40 ఏళ్లు
 టెక్నికల్ ఆఫీసర్ (క్రెడిట్) III 16 సివిల్, మెకానికల్, ప్రొడక్షన్, మెటల్లర్జీ, టెక్స్‌టైల్, కెమికల్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. 26 నుంచి 34 ఏళ్లు
 క్రెడిట్ ఆఫీసర్ III 10 సీఏ, సీఎఫ్ఏ, ఏసీఎంఏ, ఎంబీఏ ఫైనాన్స్ పాస్ కావాలి. 26 నుంచి 34 ఏళ్లు
 డేటా ఇంజనీర్ III 11 స్టాటిస్టిక్స్, ఎకనమెట్రిక్స్, మ్యాథమెటిక్స్, ఫైనాన్స్, ఎకనమిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో పీజీ లేదా కంప్యూటర్ సైన్స్, ఐటీలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. 26 నుంచి 35 ఏళ్లు
 రిస్క్ మేనేజర్ II 18 బ్యాంకింగ్, ఫైనాన్స్‌, ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా పాస్ కావాలి. లేదా స్టాటిస్టిక్స్, మ్యాథ్స్‌లో పీజీ లేదా పీజీ డిప్లొమా పాస్ కావాలి. 20 నుంచి 35 ఏళ్లు
 లా ఆఫీసర్ II 26 ఎల్ఎల్‌బీ పాస్ కావాలి. 20 నుంచి 35 ఏళ్లు
 ఐటీ II 69 కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ, లేదా పీజీ పాస్ కావాలి. 20 నుంచి 35 ఏళ్లు
 సెక్యూరిటీ II 3 డిగ్రీ పాస్ కావాలి. 26 నుంచి 45 ఏళ్లు
 ఫైనాన్షియల్ అనలిస్ట్ II 20 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ICWAI) ఫైనల్ ఎగ్జామ్ పాస్ కావాలి. లేదా ఎంబీఏ ఫైనాన్స్ పాస్ కావాలి. 20 నుంచి 35 ఏళ్లు
 క్రెడిట్ ఆఫీసర్స్ II 14 ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా ఫుల్ టైమ్ పీజీడీబీఎం (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్) పాస్ కావాలి. లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా పాస్ కావాలి. 20 నుంచి 35 ఏళ్లు
 ఎకనమిస్ట్ II 2 ఎకనమిక్స్, ఎకనోమెట్రిక్స్, రూరల్ ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ క్లాస్ పాస్ కావాలి. 20 నుంచి 35 ఏళ్లు
 సెక్యూరిటీ I 13 డిగ్రీ పాస్ కావాలి. 26 నుంచి 45 ఏళ్లు


ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 300 జాబ్స్... బీటెక్ అర్హత

Central Bank of India Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 23

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 30

కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2022 జనవరి 11

ఆన్‌లైన్ ఎగ్జామినేషన్- 2022 జనవరి 22

దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ.175.

ఎంపిక విధానం- ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ.

First published:

Tags: Bank Jobs, CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS

ఉత్తమ కథలు