సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (Centre for Development of Advanced Computing) బెంగుళూర్, పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు మరో మూడు రోజుల మాత్రమే అంటే జనవరి 18, 2022 వరకు మాత్రమే అవకాశం ఉంది.
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (Centre for Development of Advanced Computing) బెంగుళూర్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, సీడ్యాక్ అడ్జంక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష (Written Test), ఇంటర్వ్యూ (interview) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు చేయాలనుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం https://www.cdac.in/index.aspx?id=ca_ADVT_CDAC_Bengaluru_January_2022 వెబ్సైట్ను సందర్శించాలి. సంబంధిత రంగాల్లో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ (Online) ఆధారంగా ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 18, 2022 వరకు అవకాశం ఉంది.
ఖాళీల వివరాలు
పోస్టు పేరు
ఖాళీలు
టెక్నికల్ అసిస్టెంట్
03
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
03
ప్రాజెక్ట్ ఇంజనీర్
64
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్
55
ప్రాజెక్ట్ మేనేజర్
01
సీడ్యాక్ అడ్జంక్ట్ ఇంజనీర్
04
అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పోస్టులకు సంబంధించిన సబ్జెక్టుల్లో నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా.. బీఈ,బీటెక్ లేదా ఎంఈ, ఎంటెక్ లేదా ఎంసీఏ చేసి ఉండాలి.
ఎంపిక విధానం..
Step 1 : అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ (Interview) ద్వారా ఎంపిక చేస్తారు.
Step 2 : మల్టీ లెవల్ ఇంటర్వ్యూ విధానం నిర్వహిస్తారు.
Step 3 : అవసరం అయితే ఎంపిక ప్రక్రియ మార్చే హక్కు సంస్థకు ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం
దరఖాస్తులు ప్రారంభం
జనవరి 3, 2022
దరఖాస్తుకు ఆఖరు తేదీ
జనవరి 18, 2022
పోస్టు అర్హతలు
సంబంధిత రంగంలో బీఈ/బీటెక్/ ఎంసీఏ చేసి ఉండాలి. పలు పోస్టులకు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
Step 5 : అది క్లిక్ చేసిన అనంతరం పోస్టుకు సంబంధించిన వివరాలు వస్తాయి.
Step 6 : అర్హతలు సరిచూసుకొని కింద Apply ఆప్షన్పై క్లిక్ చేయాలి.
Step 7 : అనంతరం పూర్తి వివరాలు అందించి సబ్మిట్ చేయాలి.
Step 8 : దరఖాస్తుకు జనవరి 18, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.