హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CDAC Recruitment 2022 : ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో సీడ్యాక్‌లో ఉద్యోగాలు..

CDAC Recruitment 2022 : ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో సీడ్యాక్‌లో ఉద్యోగాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CDAC: ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్షకు పైగా జీతంతో ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశం సీ‌డ్యాక్ (CDAC) కల్పిస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్షకు పైగా జీతంతో ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశం సీ‌డ్యాక్ (CDAC-The Centre for Development of Advanced Computing ) కల్పిస్తోంది. ఈ సంస్థ భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MEITY) మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. తాజాగా ప్రాజెక్ట్‌ ఇంజనీర్ పోస్టుల (Project Engineer posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఇది దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 250 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, అక్టోబర్ 20తో ముగుస్తుంది.

అర్హత ప్రమాణాలు

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా AICTE/UGCతో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. CGPA/DGPA/OGPA లేదా లెటర్ గ్రేడ్‌కు సంబంధించిన పర్సంటేజ్(%) ఫ్రూఫ్‌తో పాటు ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్‌ సమర్పించడం తప్పనిసరి. అలాగే అభ్యర్థులకు 0 - 4 సంవత్సరాల సంబంధిత ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

ఎంపిక ప్రక్రియ

గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి బీ.ఈ/ బీటెక్ లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి. లేకపోతే ఎం.ఈ/ ఎం.టెక్ చేసి ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అకడమిక్ రికార్డ్స్, ఇతర అర్హత ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులను మొదట స్క్రీనింగ్ చేయనున్నారు. ఇక్కడ ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే తదుపరి దశ నియామక ప్రక్రియకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులు మూడు సంవత్సరాల పాటు ఉద్యోగంలో కొనసాగుతారు.

జీతభత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు సంవత్సర ప్యాకేజీ ప్రకారం.. రూ.8.49 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు ఉంటుంది.ఎక్స్ పీరియన్స్ ఉన్నవారికి జీతం ఎక్కువగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : గుడ్‌న్యూస్‌.. పది, ఇంటర్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

జాబ్ లోకేషన్స్

ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ , హైదరాబాద్ , కోల్‌కతా, మొహాలి, ముంబై, నోయిడా, పూణే, తిరువనంతపురం, పాట్నా, జమ్మూ, సిల్చార్, గౌహతి, శ్రీ నగర్, పూణే (కార్పొరేట్ ఆఫీస్), చండీగఢ్ వంటి నగరాల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు.

దరఖాస్తు విధానం

-మొదట సీడ్యాక్ అధికారిక వెబ్‌సైట్cdac.inను ఓపెన్‌ చేయాలి.

- అనంతరం అక్కడ అప్లై బటన్‌పై క్లిక్ చేయాలి.

- తర్వాత అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి.

- అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత, చివరగా సబ్‌మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

- భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను ఫ్రింట్ తీసుకోవాలి.

- అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Job recruitment, JOBS, Latest jobs

ఉత్తమ కథలు