CDAC NOIDA INVITING APPLICATIONS FOR 261 JOB VACANCIES HERE FULL DETAILS NS
CDAC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. C-DACలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
నిరుద్యోగులకు శుభవార్త.. C-DACలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC), నోయిడా నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. డిసెంబర్ 22ను దరఖాస్తుకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC), నోయిడా (Noida) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 261 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Notification) పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఇతర వివరాలు..
ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ వ్యవధి మూడేళ్ళు ఉంటుంది. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా కాంట్రాక్ట్ ను పొడిగిచే అవకాశం ఉంటుంది. అయితే కాంట్రాక్ట్ ను మధ్యలో రద్దు చేసే అధికారం కూడా C-DAC కు ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.