సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (Centre for Development of Advanced Computing) హైదరాబాద్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్టు ఇంజనీర్ (Project Engineer), ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టును భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష (Written Test), ఇంటర్వ్యూ (interview) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు చేయాలనుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం https://www.cdac.in/index.aspx?id=ca_advt_04_sept_2021 వెబ్సైట్ను సందర్శించాలి. సంబంధిత రంగాల్లో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ (Online) ఆధారంగా ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 5, 2021 వరకు అవకాశం ఉంది.
ఖాళీల వివరాలు
పోస్టు పేరు | ఖాళీలు |
ప్రాజెక్టు మేనేజర్ | 01 |
ప్రాజెక్టు ఇంజనీర్ | 36 |
ప్రాజెక్టు అసోసియేట్ | 01 |
ముఖ్యమైన సమాచారం
దరఖాస్తులు ప్రారంభం | సెప్టెంబర్ 17, 2021 |
దరఖాస్తుకు ఆఖరు తేదీ | అక్టోబర్ 5, 2021 |
పోస్టు అర్హతలు | సంబంధిత రంగంలో బీఈ/బీటెక్/ ఎంసీఏ చేసి ఉండాలి. పలు పోస్టులకు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. |
అధికారిక వెబ్ సైట్ | https://www.cdac.in/index.aspx |
Telangana Jobs: లా అసోసియేట్ ఉద్యోగాలు.. అర్హతలు ఇవే
ఎంపిక విధానం..
- అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
- మల్టీ లెవల్ ఇంటర్వ్యూ విధానం నిర్వహిస్తారు.
- అవసరం అయితే ఎంపిక ప్రక్రియ మార్చే హక్కు సంస్థకు ఉంటుంది.
దరఖాస్తు విధానం..
- కేవలం ఆన్లైన్ ఆధారంగానే దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా అధికారిక నోటిఫికేషన్ కోసం https://www.cdac.in/index.aspx?id=ca_advt_04_sept_2021 ను చూడాలి.
- డిస్ప్లేలో ప్రతీ పోస్టు వివరాలు ఉంటాయి.
- ప్రతీ పోస్టు పక్కన Details ఆప్షన్ ఉంటుంది.
- అది క్లిక్ చేసిన అనంతరం పోస్టుకు సంబంధించిన వివరాలు వస్తాయి.
- అర్హతలు సరిచూసుకొని కింద Apply ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- అనంతరం పూర్తి వివరాలు అందించి సబ్మిట్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Hyderabad, Job notification, JOBS