Jobs: సిమెంట్ కార్పొరేషన్‌లో ట్రైనీ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

CCIL Recruitment 2019 | ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల శిక్షణ ఉంటుంది. మరో 6 నెలలు శిక్షణను పొడిగించే అవకాశం ఉంటుంది. ట్రైనీ పోస్టులకు అక్టోబర్ 3న దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

news18-telugu
Updated: October 22, 2019, 11:26 AM IST
Jobs: సిమెంట్ కార్పొరేషన్‌లో ట్రైనీ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
Jobs: సిమెంట్ కార్పొరేషన్‌లో ట్రైనీ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 22, 2019, 11:26 AM IST
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-CCIL ఆర్టిసన్ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 60 ఖాళీలను ప్రకటించింది. సివిల్, మైనింగ్, ప్రొడక్షన్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ cciltd.in ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో మరిన్ని వివరాలు చూడొచ్చు. ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల శిక్షణ ఉంటుంది. మరో 6 నెలలు శిక్షణను పొడిగించే అవకాశం ఉంటుంది. ట్రైనీ పోస్టులకు అక్టోబర్ 3న దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తుకు అక్టోబర్ 25 చివరి తేదీ. ట్రైనీ పోస్టుల భర్తీకి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

CCIL Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 60

ఆర్టిసన్ ట్రైనీ (సివిల్)- 4
ఆర్టిసన్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్)- 9
ఆర్టిసన్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 6


ఆర్టిసన్ ట్రైనీ (వెల్డర్)- 13
Loading...
ఆర్టిసన్ ట్రైనీ (ఫిట్టర్)- 13
ఆర్టిసన్ ట్రైనీ (మెషీన్ టూల్)- 5
ఆర్టిసన్ ట్రైనీ (మైనింగ్)- 1
ఆర్టిసన్ ట్రైనీ (ప్రొడక్షన్)- 9

CCIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 అక్టోబర్ 3
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 25
ఆన్‌లైన్ టెస్ట్- 2019 నవంబర్ లేదా డిసెంబర్
విద్యార్హత- ప్రొడక్షన్ విభాగంలో ఆర్టిసన్ ట్రైనీ పోస్టుకు కెమిస్ట్రీతో బీఎస్సీ డిగ్రీ పాస్ కావాలి. మిగతా పోస్టులకు మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 27 ఏళ్లు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

Air India Jobs: 170 అసిస్టెంట్ సూపర్‌వైజర్ జాబ్స్... దరఖాస్తు గడువు పొడిగించిన ఎయిర్ ఇండియా

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... పూర్తి వివరాలు తెలుసుకోండి
First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...