Telangana Jobs: సిమెంట్ కార్పొరేషన్‌లో జాబ్స్... ఏప్రిల్ 7 చివరి తేదీ

CCI Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణలోని తాండూర్‌లో గల సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలున్నాయి. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: April 5, 2020, 9:46 AM IST
Telangana Jobs: సిమెంట్ కార్పొరేషన్‌లో జాబ్స్... ఏప్రిల్ 7 చివరి తేదీ
Telangana Jobs: సిమెంట్ కార్పొరేషన్‌లో జాబ్స్... ఏప్రిల్ 7 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తెలంగాణలోని తాండూర్, హిమాచల్ ప్రదేశ్‌లోని రాజన్, అస్సాంలోని బోకాజన్‌లోని యూనిట్లలో మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్, ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 10 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.cciltd.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాలి.

CCI Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 10
మేనేజర్- 6
అకౌంట్స్ ఆఫీసర్- 2
ఆఫీసర్- 1
ఇంజనీర్- 1

CCI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 7
విద్యార్హత- సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Manager HR,
Cement Corporation of India Limited,
Post Box No 3061,
Lodhi Road Post office,
New Delhi- 110003.

నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Bank Jobs: బ్యాంకు ఉద్యోగం మీ కలా? ఈ పరీక్షలు రాయండి

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పెంపు... ఖాళీల వివరాలివే

Job Readiness: గుడ్ న్యూస్... ఈ కోర్సు చేస్తే టాప్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు
First published: April 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading