CBSE Results 2019: సీబీఎస్‌ఈ రిజల్ట్స్ వివరాలు..

సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాలు త్వరలోనే విడుదల అన్న వార్తలను కొట్టిపారేసింది సీబీఎస్‌ఈ బోర్డు. తాము ముందుగా చెప్పినట్లుగా నే పరీక్షల ఫలితాలకు గడువు తీసుకుంటున్నట్లుగా తెలిపింది.

news18-telugu
Updated: March 30, 2019, 3:33 PM IST
CBSE Results 2019: సీబీఎస్‌ఈ రిజల్ట్స్ వివరాలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 30, 2019, 3:33 PM IST
సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాలు త్వరలోనే విడుదల అన్న వార్తలను కొట్టిపారేసింది సీబీఎస్‌ఈ బోర్డు. తాము ముందుగా చెప్పినట్లుగా నే పరీక్షల ఫలితాలకు గడువు తీసుకుంటున్నట్లుగా తెలిపింది.
సీబీఎస్‌ఈ పరీక్షలు జరిగి కొన్ని గంటలు మాత్రమే అవుతోంది. అప్పుడే కొన్ని వార్తాపత్రికలు, మీడియా సంస్థల్లో త్వరలోనే సీబీఎస్‌ఈ పరీక్షల ఫలితాలు అంటూ వార్తలు ప్రచారం చేయడంపై సీబీఎస్‌ఈ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి అసత్య వార్తలు నమ్మొద్దని తెలిపింది. ముందుగా చెప్పినట్లు పరీక్షల ఫలితాలు మే నెలలో రిలీజ్ చేస్తామని తెలిపింది.
సీబీఎస్‌ఈ 10, 12వతరగతి ఫలితాలు మే చివరినాటికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది సీబీఎస్‌ఈ బోర్డు. 12వ తరగతి ఫలితాలు 10 తరగతి ఫలితాలు విడుదలకు ఓ వారం ముందు రిలీజ్ చేస్తామని తెలిపింది. సీబీఎస్‌ఈ పదోతరగతి సోషల్ సైన్స్ పేపర్ మార్చి 29న జరిగింది. ఈ సంవత్సరంలో మొత్తం 31,14,831మంది విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపింది. ఇక సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4, 2019న ముగియనున్నాయి.

First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...