కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం అంతా గందరగోళంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? అసలు పరీక్షలు ఉంటాయా? ఉండవా? తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. అయితే కొన్ని నెలల్లో విద్యా సంవత్సరం ముగియడానికి వస్తుండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వరుసగా పరీక్షలు, ప్రవేశాల షెడ్యూల్ ను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గురువారం కీలక ప్రకటన చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ ను ఫిబ్రవరి 2న ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే.. గత డిసెంబర్ 31న సీబీఎస్ఈ బోర్డు పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. మే 4 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. జూన్ 10న పరీక్షలు ముగుస్తాయన్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. జూలై 15న ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు మే 1న ప్రారంభం అవుతాయని వివరించారు. అయితే ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ బోర్డు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th Class Exams, CBSE, CBSE Board Exams 2021, Exams