CBSE Exams 2020: సీబీఎస్ఈ పరీక్షలపై నిర్ణయం ఎప్పుడంటే

CBSE exam dates | భారతదేశంలో లాక్‌డౌన్ మే 17 వరకు కొనసాగనుంది. కొన్ని ఆంక్షల్ని సడలించినా పరీక్షల్ని నిర్వహించే పరిస్థితి లేదు. మే 17 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పట్లో అంచనా వేయడం కష్టం.

news18-telugu
Updated: May 5, 2020, 2:43 PM IST
CBSE Exams 2020: సీబీఎస్ఈ పరీక్షలపై నిర్ణయం ఎప్పుడంటే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. పరీక్ష తేదీలు ఎప్పుడు ఉంటాయని ఎదురుచూస్తున్నారు విద్యార్థులు. షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందని ఆసక్తిగా చూస్తున్నారు. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్‌పై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్నట్టు కేంద్ర మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్న తర్వాత కొత్త షెడ్యూల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE అధికారిక వెబ్‌సైట్‌ http://cbse.nic.in/ లో అప్‌డేట్ బోర్డు. అందుకే విద్యార్థులు అప్‌డేట్స్ కోసం వెబ్‌సైట్ చెక్ చేస్తూ ఉండాలి.

సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించిన 29 పేపర్ల పరీక్షల్ని నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో లాక్‌డౌన్ మే 17 వరకు కొనసాగనుంది. కొన్ని ఆంక్షల్ని సడలించినా పరీక్షల్ని నిర్వహించే పరిస్థితి లేదు. మే 17 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పట్లో అంచనా వేయడం కష్టం. కాబట్టి సీబీఎస్ఈ పరీక్షలు జూన్ లేదా జూలైలో ఉండే అవకాశముంది. మరోవైపు కాంపిటీటీవ్ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంది. ముందు కాంపిటీటీవ్ పరీక్షల్ని నిర్వహించిన తర్వాత బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Exam Dates: నీట్, జేఈఈ పరీక్ష తేదీలు వెల్లడి... ఎప్పుడంటే

Free Course: రూ.6800 విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ఉచితం... అప్లై చేయండిలా

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1,070 జాబ్స్... 2 రోజులే గడువు
Published by: Santhosh Kumar S
First published: May 5, 2020, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading