CBSE: జూలై 15 లోగా సీబీఎస్ఈ ఫలితాలు... పరీక్షలు లేకుండానే మార్కులు

CBSE Results 2020 | 10వ, 12వ తరగతి పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు సీబీఎస్‌ఈ సుప్రీంకోర్టుకు తెలపడంతో ఇప్పుడు ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

news18-telugu
Updated: June 26, 2020, 11:29 AM IST
CBSE: జూలై 15 లోగా సీబీఎస్ఈ ఫలితాలు... పరీక్షలు లేకుండానే మార్కులు
CBSE: జూలై 15 లోగా సీబీఎస్ఈ ఫలితాలు... పరీక్షలు లేకుండానే మార్కులు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 10, 12వ తరగతుల్ని రద్దు చేస్తున్నట్టు సుప్రీం కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా విద్యార్థులకు మార్కుల్ని వేయనుంది సీబీఎస్ఈ. మూడు పేపర్స్ అసెస్‌మెంట్ ద్వారా ఈ మార్కులు ఉంటాయి. జూలై 15 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయనుంది సీబీఎస్ఈ. ఈ ఫలితాల ఆధారంగానే విద్యార్థులు పై తరగతులకు అడ్మిషన్లు పొందొచ్చు. 10వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవు. అయితే 12వ తరగతి విద్యార్థులు మాత్రం పరీక్ష రాయాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎంచుకునేందుకు విద్యార్థులకు సీబీఎస్ఈ కొన్ని రోజుల సమయం ఇస్తుంది. పరీక్ష వద్దనుకునే విద్యార్థులకు జూలై 15 లోగా ఫలితాలు వస్తాయి. విద్యార్థులు పరీక్ష రాయాలన్న ఆప్షన్ ఎంచుకుంటే వారికి ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది సీబీఎస్ఈ. అయితే ఆ పరీక్షలు ఎప్పుడు ఉంటాయన్న విషయాన్ని తర్వాత వెల్లడిస్తుంది బోర్డు.

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 723 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 665 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి జూలై 15 మధ్య పరీక్షల్ని నిర్వహించాలనుకుంది సీబీఎస్ఈ. అయితే కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల్ని రద్దు చేయాలని, పరీక్షలు మిగిలిన సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు వేయాలంటూ సుప్రీం కోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 250 పాఠశాలల్లో క్లాస్ 10, 12 పరీక్షల్ని రద్దు చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా సీబీఎస్ఈ మార్కులు వేసిందని, అందరు విద్యార్థులకు అలాగే మార్కులు వేయాలని పేరెంట్స్ కోరారు. దీనిపై సుప్రీం కోర్టు పలుమార్లు విచారణ జరిపింది. పరీక్షల నిర్వహణపై నిర్ణయాన్ని తెలపాలంటూ సీబీఎస్ఈని సుప్రీం కోర్టు కోరింది. ఈ పిటిషన్‌పై మంగళవారం కూడా విచారణ జరిగింది. 10వ, 12వ తరగతుల పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు గురువారం సుప్రీం కోర్టుకు సీబీఎస్ఈ సమాచారం ఇచ్చింది.

మరోవైపు ఐసీఎస్‌ఈ కూడా సీబీఎస్‌ఈ నిర్ణయాన్నే ఫాలో ఇయంది. పరీక్షల్ని రద్దు చేసినట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికారిక నోటీస్‌ను విడుదల చేయాల్సి ఉంది.

 
First published: June 26, 2020, 11:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading