CBSE Exams: జూలై 1 నుంచి సీబీఎస్‌‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు..

కొత్త షెడ్యూల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE అధికారిక వెబ్‌సైట్‌ http://cbse.nic.in/ లో అందుబాటులో ఉంచుతారు.

news18-telugu
Updated: May 8, 2020, 5:35 PM IST
CBSE Exams: జూలై 1 నుంచి సీబీఎస్‌‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా లాక్‌డౌన్ వల్ల వాయిదాపడిన CBSE పరీక్షలపై.. కేంద్ర మానవవనరుల శాఖ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణపై గురువారం ప్రకటన చేసింది. జులై 1 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. కొత్త షెడ్యూల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE అధికారిక వెబ్‌సైట్‌ http://cbse.nic.in/ లో అందుబాటులో ఉంచుతారు. అందుకే విద్యార్థులు అప్‌డేట్స్ కోసం వెబ్‌సైట్ చెక్ చేస్తూ ఉండాలి. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించిన 29 పేపర్ల పరీక్షల్ని నిర్వహించాల్సి ఉంది. లాక్‌డౌన్ వల్ల ఆ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. మనదేశంలో మే 17 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అప్పటికి లాక్‌డౌన్ ఎత్తేసినా.. విద్యార్థులకు చదువుకునేందుకు టైమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో జూలై నుంచి పరీక్షలు నిర్వహిచాలని కేంద్ర మానవవనరుల శాఖ నిర్ణయించింది.

Published by: Shiva Kumar Addula
First published: May 8, 2020, 5:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading