Home /News /jobs /

CBSE TERM 2 EXAMS TO BE FIRST SUBJECTIVE PAPERS AFTER 2 YEARS STUDENTS OUT OF WRITING PRACTICE NS GH

CBSE Term 2 Exams: రెండేళ్ల తర్వాత చేతిరాత పద్ధతిలో పబ్లిక్‌ పరీక్షలు.. విద్యార్థులకు ఆ ఇబ్బందులు తప్పవా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత విద్యార్థులు చేతిరాత పద్ధతిలో పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో జరిగిన ఆన్‌లైన్ తరగతుల కారణంగా విద్యార్థులకు చేతితో రాసే అలవాటు దూరమైంది.

ఈ ఏడాదిలో మొట్టమొదటగా సీబీఎస్‌ఈ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి టర్మ్‌ 2 బోర్డు పరీక్షలు(Board Exams) జరుగుతున్నాయి. ఇవి రాత పరీక్షలు. గతంలో టర్మ్‌ 1 పరీక్షలను సీబీఎస్‌ఈ మల్టిపుల్‌ ఛాయిస్‌ ఫార్మాట్‌లో నిర్వహించింది. మల్టిపుల్‌ ఛాయిస్‌ పరీక్షల్లో అభ్యర్థులు సరైన సమాధానం వద్ద సర్కిల్స్‌ను నింపితే సరిపోతుంది. ఇప్పుడు 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు.. అంతకు ముందు సంవత్సరం వరుసగా 9వ తరగతి, 11వ తరగతి పరీక్షలను కరోనా కారణంగా రాయలేకపోయారు. లాక్‌డౌన్‌ సమయంలో బోర్డు పరీక్షలను నిర్వహించకుండానే తర్వాతి తరగతులకు విద్యార్థులను ప్రమోట్‌ చేశారు. ఈ క్రమంలో దాదాపు రెండు సంవత్సరాల తర్వాత విద్యార్థులు చేతిరాత పద్ధతిలో పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో జరిగిన ఆన్‌లైన్ తరగతుల కారణంగా విద్యార్థులకు చేతితో రాసే అలవాటు దూరమైంది.

ఈ విషయంపై ఒక స్కూల్ అకడమిక్‌ కో-ఆర్డినేటర్‌ మాట్లాడుతూ.. ‘విద్యార్థులు పాఠ్యాంశాలను సైతం రాయడానికి ఇబ్బంది పడుతున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఇంగ్లీష్, హిస్టరీ, పొలిటికల్‌ స్సైన్‌ వంటి సబ్జెక్టుల్లో పెద్ద పెద్ద సమాధానాలు రాయడంలో, తమ అభిప్రాయాలను వ్యక్తపరచడంలో విఫలమవుతున్నారు. అవసరమైనన్ని పదాల్లో, ఉన్న సమయంలో సమాధానాలు రాయలేకపోతున్నారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించి కేస్‌ స్టడీ తరహా ప్రశ్నలకు సమాధానాలు రాయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మ్యాథమెటిక్స్‌లో చాలా మంది కీలక స్టెప్పులను మినహాయిస్తున్నారు. అకౌంట్స్‌, ఎకనామిక్స్‌, బిజినెస్‌ స్టడీస్‌లో నేర్పించిన అంశాలను అప్లై చేయలేకపోతున్నారు.’ అని చెప్పారు.
Exam Tips: బోర్డు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? బెస్ట్ రిజల్ట్స్ కోసం ఈ 5 టిప్స్.. తెలుసుకోండి

దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో వార్షికాదాయం రూ.1 లక్ష కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు బులాన్ద్‌షార్‌లోని విద్యాగ్యాన్‌ పాఠశాలలో చదువు చెప్పారు. అక్కడ పని చేస్తున్న కో-ఆర్టినేటర్‌ అనూప్‌ తివారీ మాట్లాడుతూ.. ‘రూరల్ ఏరియాస్‌లో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సామాజిక, ఆర్థిక పరిస్థితులు చదువులపై ప్రభావం చూపుతాయి. లాక్‌డౌన్‌లో ఇళ్లకే పరిమితమై చదువుకు దూరమైన పిల్లలను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. విశ్వాసం, ప్రెజంటేషన్‌, రైటింగ్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అంశాల్లో సీబీఎస్‌ఈ టర్మ్‌ 2 విద్యార్థులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు’ అని చెప్పారు.
CBSE Term 2: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ప్రిపరేషన్ టిప్స్.. ఇంగ్లీష్‌లో ఎక్కువ మార్కులకు ఇలా చేయండి..

మల్టిపుల్‌ టెస్ట్‌ సిరీస్‌లను అనుసరిస్తున్న స్కూల్స్‌
మంచి బోర్డు ఫలితాలు సాధించేలా విద్యార్థులకు రైటింగ్‌ ప్రాక్టీస్‌ అయ్యేలా పాఠశాలలు టెస్ట్‌ సిరీస్‌, మల్టిపుల్ రౌండ్స్‌ ఆఫ్‌ బోర్డు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఉన్న సమయంలో తెలిసిన సమాచారాన్ని విద్యార్థులు ప్రెజెంట్‌ చేయగలగడం కూడా ప్రధానం. ఏ సబ్జెక్టుల్లో విద్యార్థులు బలహీనంగా ఉన్నారో గుర్తించేందుకు ప్రీ బోర్డు పరీక్షలు నిర్వహిస్తున్నారు. బలహీనంగా ఉన్న అంశాలపై తిరిగి తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. గురుగ్రామ్‌లో అమిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ రెండు టర్మ్‌లలో పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.

ఒత్తిడిని అధిగమించాలి
కొందరు విద్యా నిపుణులు తెలిపిన సమాచారం మేరకు.. బోర్టు పరీక్షలకు, ప్రవేశ పరీక్షలకు తక్కువ సమయం ఉన్న సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరిలో విశ్వాసం తగ్గినట్లు కనిపిస్తోంది. ఉన్న సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలను రాయడంలో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెద్ద సమాధానాలను వేగంగా రాయలేకపోతున్నారు. స్ట్రెస్‌ బస్టర్‌ క్లాసెస్‌, కౌన్సిలింగ్‌, నిరంతర సాధన విద్యార్థులకు చాలా అవసరం.
Published by:Nikhil Kumar S
First published:

Tags: CBSE, Cbse exams, Exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు