సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) క్లాస్ 10, క్లాస్ 12కు సంబంధించిన టర్మ్ 2 ఎగ్జామ్స్ (CBSE Term 2 Exams) ఏప్రిల్ 26 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ భరద్వాజ్ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే టర్మ్ 1 ఎగ్జామ్స్ ను నిర్వహించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. టర్మ్ 2 ఎగ్జామ్స్ ను ఏప్రిల్ 26 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మోడల్ క్వశ్చన్ పేపర్స్ ను అధికారిక వెబ్ సైట్లో విడుదల చేసినట్లు చెప్పారు. ఈ టర్మ్ 2 ఎగ్జామ్స్ కు సంబంధించి డేట్ షీట్ ను బోర్డ్ అధికారిక వెబ్ సైట్ www.cbse.nic.in వెబ్ సైట్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్లో విడుదల చేయబడిన వివరాలను మాత్రమే నమ్మాలని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించాలని వివరించారు. అలాగే ఈ పరీక్షలను ఆఫ్ లైన్ లోనే నిర్వహిస్తామని బోర్డు తెలిపింది. ఇటీవల టర్మ్-1 పరీక్షలు నిర్వహించింది. అయితే ఆ రిజల్ట్స్ ఇంకా విడుదల కాలేదు.
ఇదిలా ఉంటే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతికి సంబంధించిన టర్మ్ 1 పరీక్షలు పూర్తై దాదాపు రెండు నెలలు కావొస్తుంది. ఈ నేపథ్యంలో టర్మ్ 1 రిజల్ట్స్ దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం, సీబీఎస్ఈ బోర్డు ఫిబ్రవరిలో టర్మ్(Term) 1 ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, కచ్చితమైన రిజల్ట్(Result) తేదీపై మాత్రం బోర్డు స్పష్టతనివ్వలేదు.
TS Tenth Exams: తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు శుభవార్త.. ఎగ్జామ్స్ ఇక మరింత ఈజీ.. వివరాలివే
ఈ ఏడాది సీబీఎస్ఈ పరీక్షల్లో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. నూతన విద్యా విధానం 2020 ప్రకారం, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ(ICSE) బోర్డులు 10వ, 12వ తరగతి పరీక్షలను రెండు టర్మ్‌లలో నిర్వహిస్తున్నాయి. ఇలా టర్మ్‌ల వారీగా ఎగ్జామ్స్, రిజల్ట్స్‌ను విభజించడం ఇదే మొదటిసారి. అందుకే, ఈసారి సీబీఎస్ఈ టర్మ్ 1 రిజల్ట్స్ సాధారణం కంటే భిన్నంగా ఉండనున్నాయి.
Tenth, Inter Exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ పై మంత్రి కీలక ప్రకటన
టర్మ్ 1 పరీక్షల్లో వచ్చిన మార్కులకు ఫైనల్ రిజల్ట్‌లో 50 శాతం వెయిటేజీ ఉండనుంది. అయితే, 10వ తరగతి, 12వ తరగతి టర్మ్ 1 పరీక్షలో ఏ విద్యార్థిని కూడా ఫెయిల్ అయినట్లు ప్రకటించమని.. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాతే పాస్ లేదా ఫెయిల్ తెలియజేస్తామని బోర్డు వెల్లడించింది. ఫైనల్ రిజల్ట్లోనే టర్మ్ 1, టర్మ్ 2 పరీక్ష స్కోర్ కలిపి ఉంటుందని తెలిపింది. ఒకవేళ, విద్యార్థి టర్మ్ 1 పరీక్షకు హాజరు కానట్లైతే.. వారి ఫైనల్ రిజల్ట్‌ను పాఠశాల సబ్మిట్ చేసిన ఇంటర్నల్ మార్కుల ఆధారంగానే నిర్ణయిస్తామని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.