సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్ 2 ప్రాక్టికల్(Practical) పరీక్షలకు సంబంధించిన డేట్ షీట్‌ను విడుదల చేసింది. అంతేకాదు, సీబీఎస్ఈ క్లాస్ 10, 12 టర్మ్ 2 కోసం ప్రాక్టికల్, ఇంటర్నల్(internal) పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా బోర్డు (Board) విడుదల చేసింది. అధికారిక నోటిఫికేషన్(Notification) ప్రకారం, CBSE క్లాస్ 10, 12 టర్మ్ 2 ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 2, 2022 నుండి ప్రారంభం కానున్నాయి. అన్ని పాఠశాలలు థియరీ పరీక్షలు ప్రారంభమయ్యే కనీసం 10 రోజుల ముందు ప్రాక్టికల్(Practical) పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక, సీబీఎస్ఈ క్లాస్ 10, 12 టర్మ్ 2 థియరీ పరీక్షలు 2022 ఏప్రిల్ 26 నుండి ప్రారంభమవుతాయని బోర్డు గత వారం అధికారిక నోటిఫికేషన్‌లో ధ్రువీకరించినప్పటికీ, వివరణాత్మక డేట్ షీట్‌ను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. ప్రాక్టికల్ పరీక్షల ఆధారంగా థియరీ డేట్ షీట్ ఉండనుంది. థియరీ పరీక్షలకు సంబంధించిన డేట్ షీట్ త్వరలోనే విడుదల కానుంది.
టర్మ్ 2 ప్రాక్టికల్/ ఇంటర్నల్ ఎగ్జామ్స్ మార్గదర్శకాలు
టర్మ్ 2 క్లాస్ 10, 12 ప్రాక్టికల్/ ఇంటర్నల్ ఎగ్జామ్స్ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది బోర్డు. ఈ మార్గదర్శకాల ప్రకారం, పదో తరగతి రెగ్యులర్ అభ్యర్థులకు వారి పాఠశాలలే స్వయంగా ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించి పోర్టల్‌లో మార్కులు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక, ప్రాక్టికల్ పరీక్షల విషయానికి వస్తే.. టర్మ్ 2 కోసం రూపొందించిన సిలబస్ ప్రకారమే ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. విద్యార్థులకు వారి పాఠశాలల్లోనే కోవిడ్ ప్రోటోకాల్స్ అనుగుణంగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రైవేట్ అభ్యర్థులకు, ప్రాక్టికల్ పరీక్షలు ఉండవు. 2020-21కి ముందు పరీక్షకు హాజరైన ప్రైవేట్ అభ్యర్థులకు ప్రో -రేటా ప్రాతిపదికన ప్రాక్టికల్ మార్కులు కేటాయిస్తారు. బోర్డు అధికారులు సంబంధిత ప్రాంతీయ కార్యాలయాల ద్వారా ఆన్సర్ షీట్లను ఆయా పాఠశాలలకు చేరవేస్తారు.
ప్రాక్టికల్ పరీక్షలకు గాను ప్రతి పాఠశాలకు సీబీఎస్ఈ ఒక ఎగ్జామినర్, ఒక ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌ను కేటాయిస్తుంది.మరోవైపు, పాఠశాల తరఫున ఒక ఇంటర్నల్ ఎగ్జామినర్ ఉంటారు. పాఠశాలలు ప్రాక్టికల్ పరీక్షలను వారికి అనువైన తేదీల్లో నిర్వహించుకోవచ్చు. పాఠశాలలకు కేటాయించిన ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌తో సంప్రదించి ప్రాక్టికల్ పరీక్షకు తేదీలను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాగా, థియరీ పరీక్షల కోసం సీబీఎస్ఈ టర్మ్ 2 తేదీ షీట్‌ను త్వరలోనే విడుదల చేయనుంది సీబీఎస్ఈ. ఈ డేట్ షీట్‌ను www.cbse.gov.in వెబ్సైట్ ద్వారా బోర్డు విడుదల చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams