హోమ్ /వార్తలు /jobs /

CBSE Term 2 Exam: సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థులకు ప్రిపరేషన్ టిప్స్.. టర్మ్ 2 సైన్స్ ఎగ్జామ్‌ ప్యాటర్న్, శాంపిల్ పేపర్ వివరాలు..

CBSE Term 2 Exam: సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థులకు ప్రిపరేషన్ టిప్స్.. టర్మ్ 2 సైన్స్ ఎగ్జామ్‌ ప్యాటర్న్, శాంపిల్ పేపర్ వివరాలు..

CBSE Term 2 Exam | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విద్యార్థులు బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మార్కింగ్ స్కీమ్స్‌తో పాటు 10వ తరగతి టర్మ్ 2 శాంపిల్ ఎగ్జామ్ పేపర్స్‌ను CBSE జారీ చేసింది.

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విద్యార్థులు బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మార్కింగ్ స్కీమ్స్‌తో పాటు 10వ తరగతి టర్మ్ 2 శాంపిల్ ఎగ్జామ్ పేపర్స్‌ను CBSE జారీ చేసింది. బోర్డ్ విడుదల చేసిన టర్మ్ 2 క్లాస్ 10 శాంపిల్ పేపర్‌లలో రాబోయే బోర్డు పరీక్షలలో అడిగే ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cbseacademic.nic.in నుంచి CBSE 10వ తరగతి టర్మ్ 2 బోర్డు పరీక్ష శాంపిల్ పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్లాస్ 10 సైన్స్ ఎగ్జామ్ పేపర్లలో.. టర్మ్ 2లో కవర్ చేయాల్సిన ఛాప్టర్లు, యూనిట్లు ఉన్నాయి. రివైజ్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం బోర్డు ఎవాల్యుయేషన్ స్కీమ్‌ను కూడా విడుదల చేసింది. ఎగ్జామ్‌పై అవగాహన కోసం విద్యార్థులు ఈ శాంపిల్ పేపర్స్ సాధన చేయడం మంచిది.

    NEET 2022: ప్రిపరేషన్‌కు తగినంత సమయం లేదు.. నీట్ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్

    CBSE టర్మ్ 2 సైన్స్: ఎగ్జామ్ ప్యాటర్న్

    CBSE పదో తరగతి టర్మ్ 2 సైన్స్ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి. మొత్తం 15 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ Aలో రెండు మార్కుల ప్రశ్నలు ఏడు ఉంటాయి. సెక్షన్ Bలో మూడు మార్కుల ప్రశ్నలు ఆరు ఉంటాయి. సెక్షన్ Cలో రెండు కేస్ బేస్ట్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రశ్నలకు ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. విద్యార్థులు అలాంటి ప్రశ్నలలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకొని సమాధానాలు రాయాలి.

    శాంపిల్ పేపర్

    CBSE క్లాస్ 10 సైన్స్ టర్మ్ 2 శాంపిల్ పేపర్ కోసం

    https://cbseacademic.nic.in/web_material/SQP/ClassX_2021_22/Science-SQP_Term2.pdf లింకుపై క్లిక్ చేయవచ్చు.

    ఎగ్జామ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి?

    2021-22 ఎడ్యుకేషనల్ ఇయర్‌కు సంబంధించిన CBSE టర్మ్ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతాయి. CBSE టర్మ్ 2 పరీక్షల కోసం సిలబస్‌ను తగ్గించింది. ఈసారి 50 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తాయి.

    Job news: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. అక్కడ ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల‌కు కోచింగ్‌ ఫీజు కేవ‌లం రూ.2 మాత్రమే

    ఈ విషయాన్ని బోర్డు అధికారికంగా ప్రకటించింది. CBSE టర్మ్ 2 పేపర్లలో ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. కేస్ బేస్డ్, సిట్యుయేషన్ బేస్డ్, ఓపెన్ ఎండ్ షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు వస్తాయి. టర్మ్ 2లో ప్రతి పరీక్షకు రెండు గంటల సమయాన్ని నిర్దేశించారు. విద్యార్థులు ఈ పరీక్షలపై పూర్తి స్థాయిలో అవగాహన కోసం అధికారిక వెబ్‌సైట్ నుంచి శాంపిల్ పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకొని సాధన చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

    First published:

    ఉత్తమ కథలు