CBSE TERM 2 DATE SHEET LIKELY IN COMING WEEK CBSE NIC IN GH VB
CBSE Term 2 Exams: సీబీఎస్ విద్యార్థులకు అలర్ట్.. టర్మ్ 2 ఎగ్జామ్స్ పై తాజా సమాచారం ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ (exam schedule) కోసం 10, 12వ తరగతి విద్యార్థులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో టర్మ్ 2 పరీక్షల తేదీలను (term 2 exam dates) ప్రకటించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ (exam schedule) కోసం 10, 12వ తరగతి విద్యార్థులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో టర్మ్ 2 పరీక్షల తేదీలను (term 2 exam dates) ప్రకటించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో వచ్చే వారంతో విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుందని తెలుస్తోంది. ఈ టర్మ్ 2 పరీక్షలు టర్మ్ 1 పరీక్షలకు భిన్నంగా ఉంటాయి. టర్మ్ 1 పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు ఉండగా, టర్మ్ 2లో సబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం... 15-18 ఏళ్ల వయస్సు గల పిల్లల కోసం టీకా డ్రైవ్ ప్రారంభించడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని, బోర్డు ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్షలను నిర్వహించాలని యోచిస్తోంది.
నివేదికల ప్రకారం, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి చివరి నాటికి ప్రారంభమవుతాయి. అయితే థియరీ పరీక్షలు మార్చి-ఏప్రిల్‌లో జరుగుతాయి. ఫిబ్రవరిలో పరీక్ష తేదీలు తెలియవచ్చు. టర్మ్ పరీక్షల్లోని చాలావరకు ఒక మార్కు, 2 మార్కులు, 3 మార్కులు, 5 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. బోర్డు తన వెబ్సైట్లో టర్మ్ 2 పరీక్షలకు సంబంధించిన డిటైల్డ్ శాంపిల్ పేపర్లు విడుదల చేసింది. దీంతో సీబీఎస్ఈ బోర్డు ఈ పరీక్షలను రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది. బోర్డు ఫిబ్రవరి మొదటి వారంలో టర్మ్ 1 రిజల్ట్స్ (term 1 exam results) ప్రకటించే అవకాశం ఉంది. తదనంతరం టర్మ్ 2 పరీక్షల తేదీలు (term 2 exam dates) విడుదల చేసే అవకాశముంది.
Thodi si tho sharam karo @cbseindia29!
Corona khatam nahi hua phir bhi Term 1 karaya, Badh rah tho inko term 2 chaiye! School ki fees de reh hai time se, classes online hai, CBSE ke ghatiya old education system ko bhi jhel reh hai aur kya chaiye? #Cancelboardpariskha#cbseterm2
అయితే బోర్డు చేస్తున్న ఈ ప్లాన్స్ అన్నీ కూడా విద్యార్థుల డిమాండ్లకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. సెకండ్ టర్మ్ పరీక్షలు పోస్ట్‌పోన్ (postpone) చేయాలని లేదా ఆన్లైన్ పరీక్షలను నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. "2020 బ్యాచ్ కోసం కొన్ని పేపర్లను రద్దు చేశారు, 2021 బ్యాచ్ కోసం అన్ని పేపర్లను రద్దు చేశారు కానీ 2022 బ్యాచ్‌కి మాత్రం రెండుసార్లు ఎగ్జామ్స్ నిర్వహించడానికి బోర్డ్ రెడీ అయింది.. ఇది అన్యాయం" అని చాలా మంది విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. టర్మ్ 2 పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు అనేక పిటిషన్లు పంపించడంతో పాటు ఆన్లైన్ ప్రచారాలను కూడా చేపట్టారు.
బోర్డు పరీక్షల్లో తమ మార్కులను పెంచుకోవడానికి టర్మ్ 2 పరీక్షలకు మద్దతు ఇచ్చే కొంతమంది విద్యార్థులు ఉన్నారు. అయినప్పటికీ, వారు కూడా ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ సమయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే విద్యా సంవత్సరంలో ఎక్కువ భాగం ఆన్లైన్లో తరగతులు నిర్వహించాల్సి వచ్చింది.
ఇంతకుముందు, సీబీఎస్ఈ (CBSE) రెండు టర్మ్‌ల పరీక్షలు మంచి మార్కులను సాధించడానికి అనుకూలంగా ఉంటాయని విద్యార్థులకు హామీ ఇచ్చింది. ఫెయిల్యూర్ శాతం కూడా తగ్గుతుందని.. విద్యార్థులు తమను తాము మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతారని.. వారు తమ చదువులపై మరింత మెరుగైన రీతిలో దృష్టి పెట్టగలుగుతారని సీబీఎస్ఈ అధికారులు కూడా పేర్కొన్నారు.
TERM 2 will be conducted. And it is not good to cancel the exams as term 1 was spoiled. So in order to maintain the 12th marks we are getting a second chance to improve our conditions. Stop supporting the move to cancel the exams.#cbseterm2#CBSE#cbseclass12@cbseindia29
గత సంవత్సరం, బోర్డు పరీక్షలు నిర్వహించలేదు. దీనితో ఉత్తీర్ణత శాతం అత్యధికంగా నమోదయింది. 2021లో 99.04 శాతం మంది 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2020లో 91.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 2021లో 12వ తరగతిలో ఉత్తీర్ణత శాతం 99.37గా ఉంది, ఇది 2020లో 88.78 శాతంగా నమోదైంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.