త్వరలోనే ఈ ఏడాదికి సంబంధించిన అకడమిక్ పరీక్షలు (Academic Exams) జరగనున్నాయి. దీంతో విద్యార్థులందరూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఒక పక్క కరోనా భయం.. మరోపక్క పరీక్షలు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురువుతున్నారు. ఆన్ లైన్ క్లాసుల కారణంగా విద్యార్థులకు పాఠాలు సరిగా అర్థం కావడం లేదని, అలాగే కంటి సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు మదనపడిపోతున్నారు. దీంతో పరీక్షలు ఎలా రాస్తారో నన్న భయం వారిలో నెలకొంది. సీబీఎస్‌ఈ (CBSE) 10,12 తరగతుల విద్యార్థులకు టర్మ్1, టర్మ్2 విధానంలో పరీక్షలు జరుగుతున్నాయి. టర్మ్ 1 పరీక్ష (Term-1 Exam) మల్టిపుల్ బేస్డ్ ఆధారంగా జరిగితే.. టర్మ్ II పరీక్షలు సబ్జెక్టివ్‌గా జరగనున్నాయి. త్వరలోనే ప్రారంభం కానున్న టర్మ్ లో మొత్తం సిలబస్‌లో నుంచి 50 శాతం సబ్జెక్ట్ కవర్ అవుతుంది. విద్యార్థులు ప్రీ-బోర్డ్ అసెస్‌మెంట్లు రాయడం, రివిజన్ కోసం సీబీఎస్‌ఈ ప్రచురించిన మోడల్ పేపర్లను సాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ ప్రక్రియలో అధ్యాపకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు తమ స్టడీ అవర్స్‌లో ప్రిపరేషన్ అయ్యేటప్పుడు స్మార్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా విద్యార్థులు కఠినంగా భావించే మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలో తెలుసుకుందాం.
మ్యాథ్స్ ఎలా ప్రిపేరవ్వాలి?
చాలా మంది విద్యార్థులకు గణితం పరీక్ష (Mathematics Exam) అంటే కాస్తా కంగారుపడతారు. దీంతో పరీక్ష సమయంలో ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండాలంటే ప్రిపరేషన్ ప్రణాళికా బద్దంగా అవ్వాలి. ఇందుకు కోసం ఈ చిట్కాలు (Tips for CBSE Exam) పాటిస్తే సరిపోతుంది.
కష్టపడి చదవడం, రివైజ్ చేసుకోవడం
సాధారణంగా CBSE ప్రశ్న పత్రాలు NCERT పాఠ్యపుస్తకంపై ఆధారపడి ఉంటాయి. దీంతో విద్యార్థులు NCERT పాఠ్యపుస్తకాలను పూర్తిగా అధ్యయనం చేయాలి. అలాగే పలు ఉదాహరణలను ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష రోజున విద్యార్థులు తప్పనిసరిగా అన్ని పార్ములాస్‌ను రివైజ్ చేసుకోవడం తప్పనిసరి.
ప్రాధాన్యత ప్రశ్నలను గుర్తించడం
పరీక్ష కేంద్రంలో విద్యార్థులు చురుకుగా ఉండటానికి డీప్ బ్రీత్ (Deep Breath) తీసుకోండి. తరువాత ప్రశ్నప్రతాన్ని పూర్తిగా చదవాలి. అనంతరం సెక్షన్ వైజ్‌గా ప్రాధాన్యత ప్రశ్నలను గుర్తించండి. ఇలా చేయడం వల్ల మొదట రాసే ప్రశ్నలను చాలా కాన్ఫిడెంట్‌గా అట్మెంట్ చేయవచ్చు. తరువాత కొంచెం కష్టమైన వాటిపై దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సమయం వృథా కాదు. వీటి కోసం అదనపు సమయం కేటాయించవచ్చు.
ఏకాగ్రతతో చదవండి
కొన్ని ప్రశ్నలకు సంఖ్యా శాస్త్రానికి సంబంధించినవి ఉంటాయి. దీంతో వీటిని అటెంప్ట్చేయడానికి ఎంతో నైపుణ్యం అవసరం. అలాగే ఓపికగా గణన చేయాల్సి ఉంటుంది. దీని కోసం సీక్వెన్సింగ్‌ను జాగ్రత్తగా అనుసరించండి. ప్రశ్నలను రాసేటప్పుడు ముందుగా ప్రశ్నాప్రతంలో (Question paper) టిక్ చేయండి. ఇలా చేయడంతో కన్‌ప్యూజ్ కాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే ప్రశ్నలను సమాధాన పత్రంలో రాయకుండా ఉండేందుకు ప్రయత్నించండి. లేకపోతే అనవసరంగా సమయం వృథా అయ్యే అవకాశం ఉంటుంది.
రివైజ్ కోసం టైం కేటాయించండి
గణితానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు బొమ్మలు గీయాల్సి ఉంటుంది. దీంతో ఈ పనిని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకించి కోఆర్డినేట్ జ్యామితి, ఉపరితల వైశాల్యం, వాల్యూమ్, సర్కిల్, త్రికోణమితి (ఎత్తు, దూరం), అలాగే అనువర్తనంలో (ఎత్తు, దూరం) తదితర ప్రశ్నలకు బొమ్మలు గీస్తే మూల్యాంకనం చేసేవారి దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. పరీక్షను ముందుగానే ముగించినట్లయితే, రివైజ్ చేయడానికి మిగిలిన సమయాన్ని వెచ్చించండి.
సాధారణంగా, విద్యార్థులు పరీక్షను పూర్తి చేయడానికి 1 గంట నుంచి 1 గంట 20 నిమిషాల సమయం పడుతుంది. దీంతో మిగిలిన సమయాన్ని మీ సమాధానాలను సవరించుకోవడం లేదా ఏవైనా తప్పులు ఉంటే మరోసారి చెక్ చేసుకోవడం ఉత్తమైన పని. అన్ని ప్రశ్నలను ప్రయత్నించారో లేదో నిర్ధారించుకోండి. చివరగా, జవాబు పత్రాలను సరిగ్గా ట్యాగ్ చేయండి. పై చిట్కాలు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు, పరీక్ష సమయంలో పాటిస్తే గణితంలో మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుందని విద్యాజ్ఞాన్ మ్యాథ్స్ కో ఆర్డినేటర్ అంజనీ కుమార్ రాయ్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th Class Exams, CBSE, Exam Tips