హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Term- 2: సీబీఎస్‌ఈ టర్మ్- 2 పరీక్షల కోసం విద్యార్థులను సిద్ధం చేస్తున్న స్కూళ్లు.. కొత్త విధానంలో ఇలా..

CBSE Term- 2: సీబీఎస్‌ఈ టర్మ్- 2 పరీక్షల కోసం విద్యార్థులను సిద్ధం చేస్తున్న స్కూళ్లు.. కొత్త విధానంలో ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (CBSE) టర్మ్ 1 ఫలితాల కోసం ఒకపక్క విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తుండగానే...మరోపక్క చాలా స్కూళ్లు టర్మ్ 2 పరీక్షల కోసం విద్యార్థులకు ప్రాక్టీస్ టెస్ట్‌లు నిర్వహించి సన్నద్ధం చేస్తున్నాయి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (CBSE) టర్మ్ 1 ఫలితాల కోసం ఒకపక్క విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తుండగానే.. మరోపక్క చాలా స్కూళ్లు టర్మ్ 2 పరీక్షల కోసం విద్యార్థులకు ప్రాక్టీస్ టెస్ట్‌లు నిర్వహించి సన్నద్ధం చేస్తున్నాయి. టర్మ్(Term) 1 మాదిరి కాకుండా టర్మ్ 2లో సబ్‌జెక్టివ్‌లో ప్రశ్నాప్రతం ఉండనుంది. ఈసారి పరీక్షా విధానాన్ని బోర్డు(Board) మార్చింది. దీంతో పరీక్షలను ఎలా రాయాలో విద్యార్థులకు అంతగా అవగాహన లేకపోవచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలా స్కూళ్లు కొత్త పేపర్ ప్యాటర్న్ విధానంలో విద్యార్థుల కోసం ప్రాక్టీస్ టెస్ట్, రివిజన్ ఎగ్జామ్, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నాయి.

టర్మ్ 2 పరీక్షల్లో విద్యార్థులు సబ్జెక్టివ్ సమాధానాలు రాయడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు స్కూళ్ల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఫసిపిక్ వరల్డ్ స్కూల్ ఫ్రిన్సిపల్ సీమా కౌర్ మాట్లాడుతూ..వర్క్‌షీట్‌లు, ప్రాక్టీస్ టెస్టులను రెగ్యులర్‌గా నిర్వహిస్తూ..విద్యార్థుల రైటింగ్ స్కిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అలాగే రివిజన్ చేస్తుండటంతో కాన్సెప్ట్‌లపై విద్యార్థులకు మరింత పట్టుసాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. మ్యాథ్స్‌కు సంబంధించి పలు ప్రశ్నలను స్మార్ట్‌గా రాయడానికి గణిత చిట్కాలు, ట్రిక్స్‌లను ఉపయోగించే విధంగా విద్యార్థులను గైడ్ చేస్తున్నట్లు వివరించారు. అయితే విద్యార్థులు సబ్జెక్టివ్ సమాధానలు రాయడంపైనే ప్రధానంగా తాము దృష్టిసారించినట్లు సీమా కౌర్ పేర్కొన్నారు.

Jobs in Microsoft: బీటెక్, ఎంటెక్ పాసైనవారికి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలు... హైదరాబాద్, బెంగళూరు, నోయిడాలో జాబ్స్

అండర్‌లైన్ కీవర్డ్‌లు, సరైన లైన్ స్పేసింగ్‌ను ఎక్కువగా ఉపయోగించేటట్లు, అలాగే మంచి రైటింగ్ స్కిల్స్‌‌తో సబ్జెక్టివ్ సమాధానాలను రాసేవిధంగా విద్యార్థులకు ప్రత్యేక వర్క్ షాప్‌లు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో విద్యార్థులు బోర్డ్ పరీక్షల నాటికి మరింత మెరుగుపడతారని అన్నారు. అలాగే బోర్డు పరీక్షలను మరింత ఆత్మవిశ్వాసంతో రాయడానికి విద్యార్థుల కోసం రైటింగ్ టెస్ట్ లను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సీమా కౌర్ తెలిపారు.

రోహిణిలోని MRG స్కూల్ ఫ్రిన్సిపల్ మాట్లాడుతూ... సెకండ్ టర్మ్ పరీక్షల కోసం ప్రత్యేకంగా పెన్ను, పేపర్ ప్రాక్టీస్‌పై ఫోకస్ పెట్టామని తెలిపారు. పరీక్షల్లో విద్యార్థులు మంచి స్కోర్ సాధించడానికి బేసిక్ కాన్సెప్ట్ లను రివిజన్ చేయడం, రీజనింగ్ ప్రశ్నలను హేతుబద్ధంగా ప్రిపేర్ అవ్వడం, కేస్ స్టడీ ఆధారిత ప్రశ్నలపై కూడా పని చేయడం, ఇన్ టైంలో‌పు పరీక్షను పూర్తిచేయడం వంటి వాటిపై దృష్టిసారించినట్లు ప్రిన్సిపల్ అన్షు మిట్టల్ వివరించారు.

ప్రధాన ప్రశ్నలను అర్ధం చేసుకుంటూ చదవాలని ఆమె సూచించారు. దీంతో సమాధానాలను ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు ప్రతి ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు తప్పకుండా పరిచయం, వివరణ, ముగింపులను ఉపయోగించాలని సూచించారు. భాషా వ్యక్తీకరణపై తప్పనిసరిగా ప్రతివిద్యార్థి ప్రాక్టీస్ చేయాలన్నారు. ఆన్ లైన్ , ఆఫ్ లైన్‌లోనూ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. అయితే కరోనా కారణంగా గత కొంత కాలం నుంచి ఆఫ్ లైన్ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్ధులు కొంత భయపడుతున్నట్లు మిట్టల్ పేర్కొన్నారు.

టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభమవుతాయని CBSE ఇప్పటికే ప్రకటించింది. టర్మ్ 1లో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ లో జరిగాయి. ఇందులో మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఒక ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి. వీటిలో సరైన సమాధానాన్ని విద్యార్థి గుర్తించాల్సి ఉంటుంది. ఇక, టర్మ్ 2, పేపర్లు సబ్జెక్టివ్‌గా ఉంటాయి. ఇందులో పెద్ద, చిన్న , మధ్య ప్రశ్నలకు సెక్షన్ వైజ్‌గా సమాధానలు రాయాల్సి ఉంటుంది. ఇందులోనూ చాయిస్ ఉంటుంది. టర్మ్ 1 ఫలితాలను ప్రకటించిన తర్వాత టర్మ్ 2 కు సంబంధించిన వివరాలను ప్రకటించాలని సీబీఎస్ఈ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం.

First published:

Tags: 10th Class Exams, Bachelor of Education, Career and Courses, CBSE, Exams