హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Preparation Tips: సీబీఎస్‌ఈ క్లాస్ 12 స్టూడెంట్స్ కు ప్రిపరేషన్ టిప్స్.. అకౌంటెన్సీలో మంచి మార్కులు రావాలంటే ఇలా..

CBSE Preparation Tips: సీబీఎస్‌ఈ క్లాస్ 12 స్టూడెంట్స్ కు ప్రిపరేషన్ టిప్స్.. అకౌంటెన్సీలో మంచి మార్కులు రావాలంటే ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల కోసం విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. అయితే అకౌంటెన్సీలో మంచి మార్కులు సాధించడం సవాల్‌తో కూడుకున్నది. ఈ సబ్జెక్ట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే విద్యార్థులు ఈ ప్రిపరేషన్ టిప్స్ పాటించాలి.

సీబీఎస్‌ఈ (CBSE) 12వ తరగతి పరీక్షల కోసం విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. అయితే అకౌంటెన్సీలో మంచి మార్కులు సాధించడం సవాల్‌తో కూడుకున్నది. ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టుల మాదిరి గతంలో ఈ సబ్జెక్ట్‌ను విద్యార్థులు (Students) చదివి ఉండరు. కామర్స్ స్ట్రీమ్‌ను ఎంచుకునే విద్యార్థులు, సాధారణంగా 12వ తరగతి తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ, ఫైనాన్స్‌‌ను కెరీర్‌‌గా ఎంచుకుంటారు. ఇందులో కీలకమైన సబ్జెక్టుల్లో అకౌంటెన్సీ ఒకటి. దీంతో ఈ సబ్జెక్ట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే విద్యార్థులు ఈ ప్రిపరేషన్ టిప్స్ (Exam Tips) పాటించాలి. సిలబస్‌ను రెండు భాగాలుగా విభజించి.. టర్మ్‌ల ప్రకారం విద్యార్థులు పరీక్షలు రాయాల్సి రావడం ఇదే తొలిసారి. కొద్ది రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు, ప్రీ- బోర్డు పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మధ్యలో హోలీ, రంజాన్ పండగల సెలవులు ఉన్నాయి. దీంతో టర్మ్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి చాలా తక్కువ సమయం ఉంది. దీంతో విద్యార్థులు ప్రిపరేషన్, రివిజన్ కోసం ప్రణాళికాబద్దంగా టైంటేబుల్ వేసుకోవాలి. ప్రతి రోజు దాని ప్రకారమే చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.

ముందుగా అకౌంటెన్సీ సిలబస్‌ను మూడు భాగాలుగా విభజించుకోవాలి.

1. Not-for-profit organisations

2. Partnership

3. Company accounts

సిలబస్‌ను ఇలా మూడు భాగాలుగా విభజించుకోవాలి. ప్రతి టాపిక్‌ ప్రిపేర్ కావడానికి తగినంత సమయం కేటాయించాలి. పై మూడు విభాగాలను ఎంత వరకు అర్ధం చేసుకున్నామో తెలుసుకోవడానికి వారానికి కనీసం రెండుసార్లు టెస్ట్ చేసుకోవాలి.

CBSE Exam Tips: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. మంచి స్కోర్ కోసం టాపర్స్ టిప్స్ ఇవే..

అంకెలపై ప్రత్యేక శ్రద్ధ

ప్రశ్నాప్రతంలోని అంకెలను జాగ్రత్తగా గమనించాలి. వాటిని సమాధాన పత్రంలో రాసేటప్పుడు ఎంతో శ్రద్ధ వహించండి. అదనపు సున్నాలు రాయడం లేదా ఏదైనా అంకెను రాయకుండా మర్చిపోవడం వంటి వాటిపట్ల ఎంతో జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళా ఇలా చేస్తే మీ సమాధానం మారిపోవచ్చు. దీంతో మీకు మార్కులు తగ్గే అవకాశం ఉంది.

CBSE Term 2 Exams: ఏప్రిల్ 26 నుంచి సీబీఎస్ఈ టర్మ్ 2 ఎగ్జామ్స్.. డేట్ షీట్ విడుదల.. వివరాలివే

పూర్తి సమాధానం రాయడం

సమాధానం రాసే ముందు ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు చదవండి. ప్రశ్నకు సంబంధం లేని వాటిని సమాధానంగా రాయవద్దు. దీనివల్ల సమయం వృద్ధాకావడమే కాకుండా ఎలాంటి మార్కులు పొందలేరు. సాధారణంగా విద్యార్థులు అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. జర్నల్ ఎంట్రీస్ రాయాల్సిన ప్రశ్నలను వదిలివేసే అవకాశం ఉంది. నగదు ప్రవాహ ప్రకటనలో, అన్ని కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం నగదు.... క్లోజింగ్, ఓపెనింగ్ బ్యాలెన్స్ మధ్య వ్యత్యాసానికి సమానంగా ఉండాలి.

సరైన ఫార్మాట్‌లో ప్రజెంట్ చేయడం

మీరు రాసే సమాధానం ప్రత్యేకంగా ఉండాలి. అది సరైన ఫార్మాట్‌లో ఉండాలి. డెబిట్, క్రెడిట్ లెడ్జర్ ఖాతాలో సరైన వైపు ఉండాలి. జర్నల్ ఎంట్రీలకు తప్పనిసరిగా నరేషన్ ఉండాలి. ఖాతా శీర్షిక ఎల్లప్పుడూ సరిగ్గా ఉండాలి. మీరు రాసింది కరెక్టా కాదా అని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోండి. పరీక్ష పూర్తయిన తరువాత రివిజన్ చేయండి. అందుకు తగ్గట్టు సమయం కేటాయించుకోండి. పరీక్షను తొందరగా పూర్తి చేసే హడావిడిలో విద్యార్థులు స్పెల్లింగ్ తప్పులు, సంఖ్యాపరమైన తప్పులు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రశ్నలోని సబ్-పార్ట్‌కు సమాధానం ఇవ్వకుండా వదిలేయవచ్చు. ఖాతా ఫార్మాట్ తప్పుగా ప్రజెంట్ చేయవచ్చు. ఇలాంటి వాటిని చెక్ చేసుకోవడం కోసం సమయం ఉండే విధంగా పరీక్షను రాయండి.

First published:

Tags: Career and Courses, CBSE, Exam Tips

ఉత్తమ కథలు