Home /News /jobs /

CBSE TERM 1 RESULTS TO HAVE 50 WEIGHTAGE IN FINALS NO STUDENT TO FAIL TERM 2 DATES CBSE NIC IN GH VB

CBSE Term 1 Results: విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఆ విద్యార్థులంతా పాస్.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్​ఈ బోర్డు ఫిబ్రవరిలో టర్మ్ 1 ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, కచ్చితమైన రిజల్ట్ తేదీపై మాత్రం బోర్డు స్పష్టతనివ్వలేదు. ఈ ఏడాది సీబీఎస్​ఈ పరీక్షల్లో కొత్త విధానం అమల్లోకి వచ్చింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతికి సంబంధించిన టర్మ్​ 1 పరీక్షలు పూర్తై దాదాపు రెండు నెలలు కావొస్తుంది. ఈ నేపథ్యంలో టర్మ్​ 1 రిజల్ట్స్ దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం, సీబీఎస్​ఈ బోర్డు ఫిబ్రవరిలో టర్మ్(Term) 1 ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, కచ్చితమైన రిజల్ట్(Result) తేదీపై మాత్రం బోర్డు స్పష్టతనివ్వలేదు. ఈ ఏడాది సీబీఎస్​ఈ పరీక్షల్లో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. నూతన విద్యా విధానం 2020 ప్రకారం, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ(ICSE) బోర్డులు 10వ, 12వ తరగతి పరీక్షలను రెండు టర్మ్‌లలో నిర్వహిస్తున్నాయి. ఇలా టర్మ్​ల వారీగా ఎగ్జామ్స్​, రిజల్ట్స్​ను విభజించడం ఇదే మొదటిసారి. అందుకే, ఈసారి సీబీఎస్​ఈ టర్మ్ 1 రిజల్ట్స్​​ సాధారణం కంటే భిన్నంగా ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి : తెలుగు తేజంతో రషీద్ తో పాటు అండర్-19 కుర్రాళ్లకు బీసీసీఐ షాక్.. మెగావేలం నుంచి ఔట్..!

టర్మ్ 1 పరీక్షల్లో వచ్చిన మార్కులకు ఫైనల్​ రిజల్ట్​లో 50 శాతం వెయిటేజీ ఉండనుంది. అయితే, 10వ తరగతి, 12వ తరగతి టర్మ్ 1 పరీక్షలో ఏ విద్యార్థిని కూడా ఫెయిల్ అయినట్లు ప్రకటించమని.. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాతే పాస్​ లేదా ఫెయిల్ తెలియజేస్తామని బోర్డు వెల్లడించింది. ఫైనల్​ రిజల్ట్​లోనే టర్మ్ 1, టర్మ్ 2 పరీక్ష స్కోర్​ కలిపి ఉంటుందని తెలిపింది. ఒకవేళ, విద్యార్థి టర్మ్​ 1 పరీక్షకు హాజరు కానట్లైతే.. వారి ఫైనల్​ రిజల్ట్​ను పాఠశాల సబ్​మిట్​ చేసిన ఇంటర్నల్​ మార్కుల ఆధారంగానే నిర్ణయిస్తామని తెలిపింది.

Jobs in Vizag Steel: నిరుద్యోగులకు అలర్ట్... వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాల దరఖాస్తుకు రేపే చివరి తేదీ

త్వరలోనే టర్మ్​ 2 పరీక్షల డేట్​ షీట్​ విడుదల..
టర్మ్ 1 ఫలితాల్లో కేవలం థియరీ ఎగ్జామ్స్​లో వచ్చిన మార్చులను కాకుండా పాఠశాలలు ఇచ్చే ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను కూడా పరిగణిస్తామని బోర్డు స్పష్టతనిచ్చింది. అలాగే, ఇంటర్నల్​ అసెస్​మెంట్​ స్కోర్​ను కూడా దీనిలో పరిగణిస్తారు. ఇదిలా ఉండగా, 10, 12వ తరగతి టర్మ్ 2 పరీక్షల షెడ్యూల్​ డేట్​ షీట్ ఇంకా విడుదల కాలేదు. సీబీఎస్​ఈ టర్మ్ 2 పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించాలని భావిస్తుండగా, ప్రాక్టికల్స్ మాత్రం మార్చిలో జరగనున్నాయి. టర్మ్​2 పరీక్షల్లో సబ్జెక్టివ్, కేస్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ సబ్జెక్టుకు రెండు గంటల సమయం ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: 10th class results, CBSE, Exam results

తదుపరి వార్తలు