సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) బోర్డ్ పరీక్ష సరళిని పూర్తిగా మార్చిన విషయం మనకు తెలిసిందే. అకాడమిక్ సంవత్సరాన్ని రెండు టర్మ్‌లుగా విభజించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే పేర్కొంది. అందులో భాగంగా అక్టోబర్ 10, 2021 నాటికి పది, పన్నెండో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ మొదటి టర్మ్ (Term -1) పరీక్షలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన టైమ్ టేబుల్ (Time Table)ను అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in లో త్వరలో తెలిపే అవకాశం ఉంది. కరోనా (Corona) కారణంగా రెండు టర్మ్‌లుగా పరీక్షలు నిర్వహించాలని బోర్డు (Board) నిర్ణయించింది భవిష్యత్ పరిస్థతులను దృష్టిలో పెట్టుకొని బోర్డు ఈ నిర్ణయం తీసుకొంది. ప్రతి టర్మ్‌లో 50 శాతం సిలబస్ ఉంటుంది. ప్రతీ టర్మ్ పరీక్ష విధానం కూడా విభిన్నంగా ఉండనుంది. బోర్డ్ పరీక్ష సిలబస్ ను గత విద్యా సంవత్సరం మాదిరిగానే రేషనలైజ్ (Rationalize) చేసి బోధించారు.
టర్మ్ సెలబస్ ఆధారంగా పరీక్షలు..
2021-22 అకడమిక్ సెషన్ కోసం సిలబస్ (Syllabus)ని బోర్డు హేతుబద్ధం చేసింది. అకడమిక్ సెషన్ 2021-22 సిలబస్ సబ్జెక్ట్ (Subject) ఎక్స్‌పర్ట్స్ ద్వారా అంశాల వారీగా పరిశీలించి ఒక క్రమపద్ధతైన విధానాన్ని అనుసరించి రెండు భాగాలు చేశామని సీబీఎస్సీ అకాడమి డైరెక్టర్ జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ తెలిపారు.
IIT Education: ఐఐటీలో ఆర్ట్స్, కామర్స్ స్ట్రీమ్‌లు.. చదవొచ్చు
టర్మ్‌లో పేర్కొన్న సెలబస్ ఆధారంగా టర్మ్ చివరిలో పది, పన్నెండో తరగతి పరీక్ష నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేవలం ప రీక్షల ఆధారంగానే కాకుండా ప్రాజెక్టు (Project) పనితీరు, విద్యార్థుల ఇంటర్నల్ మార్క్స్ (Internal Marks), ప్రాక్టికల్స్ (Practicals) ఆధారంగా పూర్తి మార్కులను సీబీఎస్సీ కేటాయిస్తుంది.
టర్మ్ -1, టర్మ్-2 పరీక్ష విధానం..
సీబీఎస్సీ పరీక్షలకు రెండు టర్మ్‌లు విభజించడంతోపాటు ప్రతీ టర్మ్‌కు పరీక్ష విధానాన్ని మార్చి వేసింది. టర్మ్ -I లో కేస్-బేస్డ్ MCQ లు, అసర్షన్-రీజనింగ్ టైప్ MCQ లు, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. టర్మ్ II లో కేస్-బేస్డ్, సిచ్యుయేషన్-బేస్డ్, ఓపెన్-ఎండ్ ప్రశ్నలతో సహా షార్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ (Long Answers) ప్రశ్నలు, వివిధ ఫార్మాట్లలో ప్రశ్నలు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE, CBSE Board Exams 2021, EDUCATION, Education CBSE, Exams