సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి టర్మ్ 1 బోర్డు పరీక్షలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. పరీక్షలు రాసిన విద్యార్థులంతా ఇప్పుడు తమ ఫలితాల కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సీబీఎస్ఈ సెమిస్టర్(Cbse Semister System) విధానంలో 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో ఈ కొత్త విధానంలో ఫలితాలను ఎలా ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై సీబీఎస్ఈ బోర్డు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
సీబీఎస్ఈ టర్మ్ 1 ( CBSE Term One) పరీక్షల్లో ఏ ఒక్క విద్యార్థిని కూడా ఫెయిల్(Fail) చేయబోమని ప్రకటించింది. టర్మ్ 1 మార్క్ షీట్లో కేవలం మార్కులు(Marks) మాత్రమే ఉంటాయని, పాస్, ఫెయిల్ వంటి వివరాలేవీ ఉండవని స్పష్టం చేసింది. టర్మ్ 2 పరీక్షలు ముగిశాక తుది ఫలితం వెల్లడిస్తామని తెలిపింది.
అంటే, టర్మ్ 1, టర్మ్ 2, ఇంటర్నల్ మార్కులను వెయిటేజీ ఆధారంగా లెక్కగట్టి తుది ఫలితం ప్రకటిస్తుంది. తద్వారా, టర్మ్1లో తక్కువ మార్కులు వచ్చిన వారు.. టర్మ్ 2లో ప్రణాళిక ప్రకారం చదివి మంచి మార్కులు తెచ్చుకొవచ్చు. టర్మ్1లో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ, టర్మ్ 2లో ఎక్కువ మార్కులొస్తే పాస్ అవుతారు. దీని ద్వారా పాస్ పర్సంటేజ్ పెరుగుతుందని బోర్డు భావిస్తుంది. ఈ నిర్ణయం 33 లక్షల మంది విద్యార్థులకు ఊరటనిస్తుందని బోర్డు అధికారులు తెలిపారు.
జనవరి మొదటి వారంలో టర్మ్1 ఫలితాలు..
కాగా, ఈ ఏడాది విద్యార్థులపై కరోనా మహమ్మారి భారీగానే ప్రభావం చూపింది. ఆన్లైన్ క్లాసులకు తోడు కొత్తగా ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానంపై అవగాహన లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు, పేపర్లు కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో వారి ఆందోళనకు తలొగ్గిన సీబీఎస్ఈ బోర్డు ఎవ్వరినీ ఫెయిల్ చేయకూడదని నిర్ణయించింది. బోర్డు ప్రకారం, టర్మ్ 1 బోర్డు పరీక్ష ఫలితాల్లో మార్కులు మాత్రమే ఉంటాయి.
IIT Madras : ఐఐటీలో డేటా సైన్స్ కోర్సు చేయాలనుకొంటున్నారా.. అయితే దరఖాస్తు చేసుకోండి
విద్యార్థులకు పాస్, ఫెయిల్, రిపీటర్ లేదా కంపార్ట్మెంట్ గ్రేడ్లను కేటాయించరు. అయితే, టర్మ్ 2 పరీక్షలు ముగిసిన తర్వాత మాత్రం పాస్ లేదా ఫెయిల్ మెరిట్ జాబితాను రిలీజ్ చేయాలని బోర్డు నిర్ణయించింది. టర్మ్ 1, టర్మ్ 2, ఇంటర్నల్ ఎవల్యూషన్ స్కోర్ల ఆధారంగా తుది ఫలితాన్ని ప్రకటిస్తుంది. టర్మ్ 1 ఫలితాలు 2022 జనవరి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. టర్మ్ 2 పరీక్షలను మార్చి- ఏప్రిల్ మధ్య నిర్వహించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE, CBSE Board Exams 2021, Education CBSE, Intermediate exams