Home /News /jobs /

CBSE TENTH CLASS TERM 2 EXAMINATIONS IN APRIL TIPS TO BE FOLLOWED FOR HIGHER MARKS IN ENGLISH GH VB

CBSE Exam: ఏప్రిల్​లో CBSE పదో తరగతి టర్మ్ 2 పరీక్షలు​.. ఇంగ్లీష్​లో ఎక్కువ మార్కుల కోసం పాటించాల్సిన టిప్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్‌సీ పదోతరగతి టర్మ్‌ 2లో ఇంగ్లీష్​ సబ్జెక్ట్​కు చాలా ప్రాధాన్యత ఉంది. ఇంగ్లీష్​ కాస్త కఠినంగా అనిపించినప్పటికీ.. ప్రణాళికతో చదివితే.. మంచి స్కోర్​ సాధించవచ్చు. ఈ ​పరీక్షకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడేలా నిపుణులుకొన్ని సూచనలు చేస్తున్నారు. అవే

ఇంకా చదవండి ...
సీబీఎస్​ఈ టర్మ్​ 2(CBSE Term 2) పదోతరగతి పరీక్షలు ఏప్రిల్​లో(April) ప్రారంభంకానున్నాయి. కోవిడ్‌ కారణంగా ఆన్​లైన్​ క్లాసులు(Online Classes), ఎగ్జామ్​ ప్యాటర్న్‌లో(Exam Pattern) వచ్చిన మార్పులతో విద్యార్థులు(Students) ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. సీబీఎస్‌సీ(CBSE) పదోతరగతి టర్మ్‌ 2లో ఇంగ్లీష్(English)​ సబ్జెక్ట్​కు చాలా ప్రాధాన్యత ఉంది. ఇంగ్లీష్​ కాస్త కఠినంగా అనిపించినప్పటికీ.. ప్రణాళికతో చదివితే.. మంచి స్కోర్​ సాధించవచ్చు. ఈ ​పరీక్షకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడేలా నిపుణులుకొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం.

రైటింగ్ ప్రాక్టీస్

ప్రణాళికాబద్దంగా విద్యార్థులు రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. దాదాపు సంవత్సరం పాటు కరోనా కారణంగా రైటింగ్‌ అలవాటుకు విద్యార్థులు దూరంగా ఉన్నారు. అందుకే పరీక్షలకు ముందు విద్యార్థులు రాయడం ప్రాక్టీస్‌ చేసే ఉపయోగకరంగా ఉంటుంది. పరీక్షలో ప్రతి సెక్షన్​కు సంబంధించి వేర్వేరు ప్రణాళికలు అవసరం. ఇంగ్లీష్​ పరీక్షలో అడిగే వేర్వేరు ప్రశ్నలకు తగిన విధంగా ముందే సిద్ధమైతే సులువుగా మంచి మార్కులు సాధించవచ్చు. ఆయా సెక్షన్లపై అవగాహన పెంచుకునేందుకు నిపుణుల సూచనలు ఇవే..

LIC Recruitment 2022: టెన్త్ పాసైనవారికి ఎల్ఐసీలో జాబ్స్... త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు

సెక్షన్​ ఏ (రీడింగ్​)

రీడింగ్‌ కాంప్రెహెన్షన్‌ ప్యాసేజ్‌లను ఎదుర్కొనేందుకు తరచూ చదవడం ప్రాక్టీస్‌ చేయాలి. ఎగ్జామ్​ ప్రారంభమయ్యే వరకు వారానికి కనీసం నాలుగు ప్యాసేజ్‌లను చదవాలి. అందులో రెండు డిస్కర్సివ్‌, రెండు కేస్‌ బేస్ట్‌ ఫ్యాక్చువల్‌ ప్యాసేజ్‌ ఉండేలా చూసుకోవాలి. సెక్షన్‌ ఏ లో మంచి మార్కులు రావాలంటే తక్కువ సమయంలో ప్యాసేజ్‌లోని సమాచారాన్ని గ్రహించాలి. 15 నిమిషాల్లో ప్యాసేజ్‌ను చదివి పూర్తిగా అర్థం చేసుకొనేలా ప్రాక్టీస్‌ చేయాలి.

సెక్షన్​ బి (రైటింగ్ అండ్​ గ్రామర్​)

ఎగ్జామినర్​కు సులభంగా అర్థమయ్యేలా అనలైటికల్‌ పేరాగ్రాఫ్‌లు రూపంలో సమాధానాలు రాయాలి. పేరాగ్రాఫ్​లలో తరచూ ఉపయోగించే పదాలపై విద్యార్థులు పట్టు సాధించాలి. ఎంత ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే అంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రణాళిక లెటర్‌ రైటింగ్‌కి కూడా పనికొస్తుంది. లెటర్‌ ఫార్మాట్‌పై అవగాహన పెంచుకోవాలి. విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడంపై ప్రాక్టీస్‌ చేయాలి. గ్రామర్‌ రూల్స్‌పై కూడా దృష్టి పెట్టాలి. వీలైనన్ని గ్రామర్‌ ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామర్‌ నేర్చుకోవడానికి ఇంటర్నెట్‌లో అనేక రిసోర్సెస్‌ అందుబాటులో ఉన్నాయి.

Jobs in Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో 135 జాబ్స్.. నెలకు రూ.లక్షకు పైగా వేతనం.. ఇలా అప్లై చేసుకోండి

సెక్షన్‌ సి (లిటరేచర్‌)

వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్​ చేస్తే లిటరేచర్​ సెక్షన్‌లో మంచి మార్కులు సాధించవచ్చు. ఏదైనా పాఠం చదువుతున్నప్పుడు అందులోని కీ వర్డ్స్‌ వినియోగించి నోట్స్‌ సిద్ధం చేసుకొంటే ప్రశ్నలకు సులభంగా సమాధానాలు రాయవచ్చు. పరీక్ష సమీపించిన సమయంలో చదవడం ఎలాంటి ప్రయోజనం చేకూర్చదని నిపుణులు చెబుతున్నారు. పరీక్షకు ముందు సులువుగా రివిజన్‌ చేసేలా కీ వర్డ్స్‌తో నోట్స్‌ సిద్ధం చేసుకోవాలి. ఎన్ని పదాల్లో సమాధానాలు రాయాలనే అంశంపై దృష్టి పెట్టాలి. ఆయా పదాలను ప్రాక్టీస్‌ చేస్తే మిగతా సెక్షన్లకు సమయం సమయం మిగులుతుంది.

ప్రజెంటేషన్​

మీ జవాబులను చక్కగా, నీట్​గా ప్రజెంటేషన్​ చేయండి. ప్రశ్నపత్రం క్రమాన్ని అనుసరించి సెక్షన్ల వారీగా స్పష్టమైన చేతివ్రాతతో సమాధానాలు రాయాలి.

ప్రీవియస్​ క్వశ్చన్​ పేపర్లను సాల్వ్​ చేయండి

టైమ్​, వర్డ్​ లిమిట్​ను పరిశీలిస్తూనే వీలైనన్ని ఎక్కువ మోడల్ క్వశ్చన్​ పేపర్లను సాల్వ్​ చేయండి. మీ స్థానిక భాష, ఎస్​ఎమ్​ఎస్​ భాష, షార్ట్​ ఫారమ్​లను ఉపయోగించవద్దు. గ్రామర్​ యాక్యురసీ, స్పెల్లింగ్‌లపై దృష్టి పెట్టండి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, CBSE, Cbse exams

తదుపరి వార్తలు