హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Results 2022: సీబీఎస్​ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్స్ ఎప్పుడంటే?

CBSE Results 2022: సీబీఎస్​ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్స్ ఎప్పుడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్​ఈ (CBSE) టర్మ్​ 1 ఫలితాల కోసం దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు(Students) ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 10, 12వ తరగతి టర్మ్​ 1 పరీక్షలు పూర్తై దాదాపు రెండు నెలలు కావొస్తున్నా.. ఇంకా ఫలితాలపై స్పష్టత లేదు.

సీబీఎస్​ఈ (CBSE) టర్మ్​ 1 ఫలితాల కోసం దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 10, 12వ తరగతి టర్మ్​ 1 పరీక్షలు (Exams) పూర్తై దాదాపు రెండు నెలలు కావొస్తున్నా.. ఇంకా ఫలితాలపై స్పష్టత లేదు. దీంతో, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే, వారందరికి త్వరలోనే ఓ గుడ్​న్యూస్​ రాబోతుంది. ఫిబ్రవరి నెలలోనే ఫలితాలు విడుదల చేయాలని సీబీఎస్​ఈ భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఫలితాలు విడుదలయ్యే ఖచ్చితమైన తేదీపై స్పష్టత రానుంది.సీబీయస్ఈ రిజల్ట్ తేదీని తనఅధికారిక హ్యాండిల్ @ cbseindia29 ద్వారాఅనౌన్స్ చేస్తుంది. అయితే,చాలా ఆన్​లైన్​ పోర్టల్స్, వెబ్ సైట్లలో సీబీయస్ఈ రిజల్ట్స్ డేట్ గురించి నకిలీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అఫీషియల్ గా డేట్ వివరాలు తెలుసుకోవాలంటే.. సీబీయస్ఈ (CBSE) అధికారిక వెబ్ సైట్, cbse.nic.in అలాగే cbseresults.nic.in లో చూడాలి. రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక స్కోర్ లు, మార్క్స్ షీట్ లు అన్నీ పోర్టల్స్ లో కనిపిస్తాయి.

కానీ అఫీషియల్ డేట్ మాత్రం సీబీయస్ ఈ అధికారిక పోస్ట్ ల ద్వారానే తెలుసుకోవాలి. నకిలీ వార్తల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, రిజల్ట్ డేట్​ త్వరలోనే ప్రకటిస్తామని సీబీఎస్​ఈ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఏమైనా సందేహాలుంటే.. తమ స్కూలు యాజమాన్యాన్ని సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు.

Tips for CBSE Exams: త్వరలో సీబీఎస్‌‌ఈ‌‌ పరీక్షలు.. గణితంలో మంచి స్కోర్​ కోసం ఈ సూచనలు పాటించండి

రిజల్ట్స్​పై నకిలీ వార్తలు నమ్మొద్దు..

2018 నుంచి సీబీయస్ఈ రిజల్ట్స్ డేట్ అనౌన్స్ చేసే విధానాన్ని మార్చింది. తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మాత్రమే రిజల్ట్స్​ డేట్​నుఅనౌన్స్ చేస్తుంది.అయితే, ఈ సంవత్సరం ఫలితాలు రెండు భాగాలుగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా.. రిజల్ట్స్ పేరుతో వాట్సాప్, సోషల్ మీడియాల్లో చక్కర్లు కొట్టే వార్తలు, వెబ్ సైట్ లింకులను ఫాలో అవ్వొద్దని సీబీయస్ఈ విద్యార్థులకు సూచిస్తోంది.విద్యార్థులు సీబీయస్ఈ అఫీషియల్ సోర్సెస్ ను ఉపయోగించి మాత్రమే రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని చెప్తోంది.

CBSE Term 2 English Exam: ఏప్రిల్‌లో సీబీఎస్‌ఈ టర్మ్‌ 2 ఇంగ్లీష్ ఎగ్జామ్​.. ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ సూచనలు పాటించండి

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. రాబోయే రెండు వారాల్లోటర్మ్ 1 రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ రిజల్ట్స్ లో విద్యార్థులుపాస్ లేదా ఫెయిల్ సర్టిఫికేట్ పొందలేరు. కేవలం మార్క్స్ వివరాలు మాత్రమే పొందుతారు. వాటిని బట్టిటర్మ్ 2 పరీక్షలను ప్లాన్ చేసుకోవాలి.టర్మ్ 2 ఎగ్జామ్స్.. ఏప్రిల్ 26 నుంచి మొదలవుతాయి. టర్మ్​ 1, టర్మ్​ 2 రెండింటిలో వచ్చిన మార్కులను యావరేజ్​ చేసి ఫైనల్​ మార్కులు ప్రకటిస్తారు. అందుకే, టర్మ్​ 2 ఫలితాల సమయంలోనే పాస్​ లేదా ఫెయిల్​ అనే విషయం తెలుస్తుంది.

First published:

Tags: CBSE, Cbse results, Exams

ఉత్తమ కథలు