సీబీఎస్ఈ (CBSE) సబ్జెక్టులపై బోర్డు కీలక నిర్ణయం తీసుకొంది. సీబీఎస్‌ఈ సహా ఇతర బోర్డుల పదో తరగతి వార్షిక పరీక్షల్లో తొలిసారిగా తెలుగుభాష పేపర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ముగింపు అంటే 2023లో జరిగే వార్షిక పరీక్షల్లో సీబీఎస్‌ఈ, ఐసీఈఎస్‌ఈ, ఐబీ గుర్తింపు పొందిన పాఠశాలల్లో తెలుగు పరీక్ష నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం 2018-19లో తీసుకొచ్చిన ‘తెలుగు తప్పనిసరి అమలు చట్టం’ ద్వారా ఇది అమల్లోకి రానున్నది. వచ్చేఏడాది పాఠశాల స్థాయిలో అన్ని తరగతుల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండనున్న నేపథ్యంలో పరీక్షలను సైతం నిర్వహిస్తారు. ఇందుకోసం ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలను సిద్ధం చేశారు.
TSPSC Group 1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ఇంటర్వ్యూల రద్దు నేపథ్యంలో కీలక మార్పు!
ఇంగ్లీష్ తప్పనిసరి..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ), ఇంటర్నేషనల్ బోర్డు (ఐబీ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్‌ఈ) బోర్డుల గుర్తింపు పొందిన పాఠశాలల్లో బహుళభాషా విధానం అమల్లోకి తీసుకొస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా 1 -4 తరగతుల్లో ఏవైనా రెండుభాషలు, 5 నుంచి 8 వరకు త్రిభాషాసూత్రం ప్రకారం మూడు భాషలు, 9, 10 తరగతుల్లో ఇంగ్లిష్ తప్పనిసరి చేయనున్నారు. 2018 నుంచి దశలవారీగా ప్రాథమికస్థాయి, ఉన్నత తరగతుల్లో తెలుగు తప్పనిసరిగా ఈ విధానం అమలవుతున్నది. 2022 -23 సంవత్సరంలో అన్ని తరగతుల్లో తెలుగు తప్పనిసరి చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఎస్సెస్సీ పరీక్షల్లో తెలుగు చేరనున్నది.
ISRO Recruitment: ఇస్రోలో ఉద్యోగ అవకాశాలు.. అర్హతలు అప్లికేషన్ విధానం..
పాఠశాలలపై చర్యలు..
ఏదైనా పాఠశాల ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఫిర్యాదు అందితే, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) నోటీసు జారీచేస్తారు. యాజమాన్యం స్పందించని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే రూ.50వేల జరిమానా విధించే అవకాశమున్నది. రెండోసారి ఉల్లంఘిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. మూడోసారి ఉల్లంఘనైతే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తారు.
పాఠశాలలపై చర్యలు..
ఏదైనా పాఠశాల ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఫిర్యాదు అందితే, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) నోటీసు జారీచేస్తారు. యాజమాన్యం స్పందించని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే రూ.50వేల జరిమానా విధించే అవకాశమున్నది. రెండోసారి ఉల్లంఘిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. మూడోసారి ఉల్లంఘనైతే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తారు.
ఈ విధానం ప్రకారం విద్యార్థులు మరో ప్రాంతీయ భాషను విద్యార్థులు ఎంచుకోవచ్చు. తాజాగా మన రాష్ట్రంలో తెలుగు తప్పనిసరికావడంతో పదో తరగతిలోకి ప్రవేశించే వారు ఇంగ్లిష్, తెలుగును మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఎస్సీఈఆర్టీ అధికారులు మాతృభాషగా చదువుకుంటున్న వారికోసం ‘సింగిడి’, మాతృభాష కాని వాళ్లకు ‘వెన్నెల’ పేరుతో పాఠ్యపుస్తకాలను రూపొందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE, Education CBSE, Telugu language