విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సొంత జిల్లాల్లోనే CBSE పరీక్షలు

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడ్డ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే CBSE విడుదల చేసింది. మిగిలిన పేపర్లకు జూలై 1 నుంచి జూలై 15 మధ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

news18-telugu
Updated: May 27, 2020, 6:36 PM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సొంత జిల్లాల్లోనే CBSE పరీక్షలు
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
CBSE పరీక్షలు రాయబోయే విద్యార్థులకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ శుభవార్త చెప్పింది. కరోనా లాక్‌డౌన్ వల్ల సొంతూళ్లకు వెళ్లిన విద్యార్థులంతా.. అక్కడి నుంచే పరీక్షలు రాయవచ్చని కేంద్రమంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 10, 12వ తరగతి పరీక్షలకు సొంత జిల్లాల నుంచే హాజరుకావొచ్చని వెల్లడించారు. సొంతూళ్లకు వెళ్లిన విద్యార్థులంతా తమ పాఠశాలల యాజమాన్యానికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. విద్యార్థులు ఏ స్కూల్‌లో పరీక్షలు రాయాలన్న వివరాలను జూన్‌ మొదటి వారంలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వల్ల సొంతూళ్లలో ఉన్న విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.కాగా, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడ్డ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే CBSE విడుదల చేసింది. మిగిలిన పేపర్లకు జూలై 1 నుంచి జూలై 15 మధ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

సీబీఎస్ఈ 12వ తరగతి షెడ్యూల్
హోమ్ సైన్స్ (ఆల్ ఇండియా)- జూలై 1
హిందీ ఎలక్టీవ్, హిందీకోర్ (ఆల్ ఇండియా)- జూలై 2ఫిజిక్స్ (ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు)- జూలై 3
అకౌంటెన్సీ (ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు)- జూలై 4
కెమిస్ట్రీ (ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు)- జూలై 6
కంప్యూటర్ సైన్స్ (ఓల్డ్), ఇన్ఫర్మెటిక్స్ ప్రాక్ (న్యూ), కంప్యూటర్ సైన్స్ (న్యూ), ఇన్ఫర్మెటిక్స్ ప్రాక్ (ఓల్డ్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఆల్ ఇండియా)- జూలై 7
ఇంగ్లీష్ ఎలక్టీవ్ ఎన్, ఇంగ్లీష్ ఎలక్టీవ్ సీ, ఇంగ్లీష్ కోర్ (ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు)- జూలై 8
బిజినెస్ స్టడీస్ (ఆల్ ఇండియా)- జూలై 9
జాగ్రఫీ (ఆల్ ఇండియా)- జూలై 11
సోషియాలజీ (ఆల్ ఇండియా)- జూలై 13
పొలిటికల్ సైన్స్ (ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు)- జూలై 14
మ్యాథమెటిక్స్ (ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు)- జూలై 15
ఎకనమిక్స్ (ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు)- జూలై 15
బయాలజీ (ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు)- జూలై 15
హిస్టరీ (ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు)- జూలై 15

సీబీఎస్ఈ 12వ తరగతి షెడ్యూల్ (ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు)
సోషల్ సైన్స్- జూలై 1
సైన్స్- జూలై 2
హిందీ కోర్స్ ఏ, హిందీ కోర్స్ బీ- జూలై 10
ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్- జూలై 15

పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE అధికారిక వెబ్‌సైట్ http://www.cbse.nic.in/ లో చూడొచ్చు.


Published by: Shiva Kumar Addula
First published: May 27, 2020, 6:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading