హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Scholarship: సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌-2022 అప్లికేషన్ గడువు పొడిగింపు.. సీబీఎస్ఈ ప్రకటన

Scholarship: సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌-2022 అప్లికేషన్ గడువు పొడిగింపు.. సీబీఎస్ఈ ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ను ఏటా అందిస్తోంది. అయితే ఈ ఏడాదికి సంబంధించిన స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు గడువును బోర్డు తాజాగా పొడిగించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ను ఏటా అందిస్తోంది. అయితే ఈ ఏడాదికి సంబంధించిన స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు గడువును బోర్డు తాజాగా పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ద్వారా నవంబర్ 30 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. విద్యార్థుల అప్లికేషన్స్ వెరిఫై చేయడానికి స్కూళ్లకు డిసెంబర్ 12వరకు సమయం ఉంది. గత సంవత్సరం ఈ స్కాలర్‌షిప్ (Scholarship) పొందిన విద్యార్థులు ఈ ఏడాదికి రెన్యూవల్ చేసుకోవడానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తుది గడువును కూడా సీబీఎస్‌ఈ పొడిగించింది.

అప్లికేషన్ ప్రాసెస్

విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in ఓపెన్ చేసి, ‘Single girl child scholarship X-2022 REG’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫ్రెష్ లేదా రెన్యూవల్ కోసం అప్లికేషన్ ఎంపిక చేసుకోండి.

Scholarships: మహిళలు, వెనుకబడిన వర్గాల పిల్లలకు స్పెషల్ స్కాలర్‌షిప్స్.. అప్లై చేయడానికి చివరి తేదీలివే..

ఇక్కడ అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. అప్లికేషన్ ఫారమ్‌ను కంప్లీట్ చేసి, సబ్‌మిట్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.

అర్హత ప్రమాణాలు

2021–2022 అకడమిక్ ఇయర్‌లో CBSE గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న సింగిల్ గర్ల్ స్టూడెంట్స్... CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ -2022కు దరఖాస్తు చేసుకోవచ్చు. సింగిల్ గర్ల్ వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండాలి. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలో 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్థిని ప్రస్తుతం చదువుతున్న పాఠశాల ట్యూషన్ ఫీజు నెలకు రూ.1,500కు మించకూడదు.

రాబోయే రెండేళ్లలో ట్యూషన్‌ ఫీజులో పెరుగుదల ప్రస్తుత మొత్తంలో 10% కంటే ఎక్కువ ఉండకూడదు. CBSE బోర్డుతో అనుబంధంగా ఉన్న పాఠశాలలో NRI కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లయితే, బోర్డ్ విధించిన షరతులను సంతృప్తి పరిస్తేనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారి స్కూల్ ట్యూషన్ ఫీజు నెలకు రూ.6,000కు మించకూడదు. ఎంపికైన విద్యార్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ. 500 స్కాలర్‌షిప్ రూపంలో లభించనుంది.

కాగా, సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ పథకాన్ని సీబీఎస్‌ఈ 2006లో ప్రారంభించింది. సింగిల్ గర్ల్ స్టూడెంట్స్ విద్యను మరింత నేర్చుకోవడానికి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి దీనికి రూపకల్పన చేసినట్లు బోర్డు ప్రకటించింది. బాలికల్లో విద్యను ప్రోత్సహించడంలో తల్లిదండ్రుల ప్రయత్నాలను గుర్తించడం, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించడం కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

First published:

Tags: Career and Courses, CBSE, Scholarship

ఉత్తమ కథలు