CBSE Exams: నేడు సీబీఎస్‌‌ఈ 2021 బోర్డ్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదల

ప్రతీకాత్మక చిత్రం

CBSE: సీబీఎస్ఈ (CBSE) 2021 బోర్డు ఎగ్జామ్స్‌పై కేంద్ర విద్యశాఖ కీలక ప్రకటన చేసింది. సీబీఎస్ఈ 2020 తుది పరీక్షల తేదీలను ఇవాళ సాయంత్రం ప్రకటించనున్నారు.

  • Share this:
    కరోనా మహమ్మారితో విద్యావ్యవస్థ అస్తవ్యస్తమయింది. మార్చి నుంచి ఇప్పటి వరకూ అదే పరిస్థితి. గత విద్యాసంవత్సరం పరీక్షలను నిర్వహించకుండానే పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్నా.. పరిస్థితులు ఇంకా పూర్తిస్థాయిలో చక్కబడలేదు. విద్యారంగం ఇంకా కోలేకోలేదు. ఇంకా చాలా చోట్ల స్కూళ్లు ప్రారంభం కాలేదు. కానీ అప్పుడే మళ్లీ పరీక్షల గోల మొదలయింది. సీబీఎస్ఈ (CBSE) 2021 బోర్డు ఎగ్జామ్స్‌పై కేంద్ర విద్యశాఖ కీలక ప్రకటన చేసింది. సీబీఎస్ఈ 2020 తుది పరీక్షల తేదీలను ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రకటించనున్నట్లు కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు.

    ''విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ముఖ్యమైన ప్రకటన. 2021 సీబీఎస్ఈ బోర్డు పరీక్షలకు సంబంధించిన తేదీలను డిసెంబరు 31న సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తాం.'' అని రమేష్ పొఖ్రియాల్ ట్వీట్ చేశారు.

    కేంద్ర విద్యాశాఖ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.


    ఈ నెలారంభంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీచర్లతో మాట్లాడిన రమేష్ పొఖ్రియాల్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత బోర్డు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ప్రకటించారు. ''సాధారణంగా ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 1 నుంచి 15 మధ్య, థియరీ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుంచి మార్చి మధ్య వరకు జరుగుతాయి. కానీ ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల వలన ఫిబ్రవరి ఆఖరు వరకు పరీక్షలు నిర్వహిండచం కుదరదు. ఫిబ్రవరి ఆఖరు తర్వాత ఎప్పుడు పరీక్షలు నిర్వహించాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.'' అని ఆ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

    కరోనా పరిస్థితుల నేపథ్యంలో ల్యాబ్ వర్క్ కోసం స్కూల్‌కు హాజరుకాని విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నామని రమేష్ పొఖ్రియాల్ చెప్పారు. ఇక 2021 పరీక్షలను ఆన్‌లైన్‌లలో నిర్వహించమని.. రాతపరీక్షలను నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
    Published by:Shiva Kumar Addula
    First published: