హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Board Exam 2021: సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు.. పూర్తి వివరాలివే..

CBSE Board Exam 2021: సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) తాజాగా కీలక ప్రకటన చేసింది. 10, 12 తరగతుల పరీక్షల తేదీల్లో పలు మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) తాజాగా కీలక ప్రకటన చేసింది. 10, 12 తరగతుల పరీక్షల తేదీల్లో పలు మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం నూతన డేట్ షీట్ ను బోర్డు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 12 వ తరగతి మాథ్స్ పరీక్ష గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1న నిర్వహించాల్సి ఉండగా మే31వ తేదీకి మార్చారు. ఫిజిక్స్ పరీక్షను మే 13కు బదులుగా జూన్ 8న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతికి సంబంధించి సైన్స్ పరీక్షను జూన్ 2కు బదులుగా మే 21న నిర్వహించనున్నారు. 10వ తరగతికి సంబంధించి పరీక్ష ప్రారంభమయ్యే, ముగిసే తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేశారు.

సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు మే 4న ప్రారంభమై, జూన్ 7న ముగియనున్నాయి. అయితే 12 వ తరగతి పరీక్షలు మే 4న ప్రారంభం కానున్నాయి. అయితే పాత షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షజూన్ 11న ముగియనుండగా జూన్ 14న పరీక్షలు మగిసేలా నూతన షెడ్యూల్ ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ cbse.nic.in నుం సందర్శించాలని బోర్డు సూచించింది.

ఇదిలా ఉంటే.. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(JEE Main 2021) మార్చి సెషన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 2 ప్రారంభమైంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. అయితే సమయం తక్కువ ఉండడంతో తప్పులు సవరించుకోవడానికి కరెక్షన్ విండోను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడం లేదు. మార్చి 6 సాయంత్రం 6 గంటల అనంతరం విద్యార్థులు అప్లికేషన్ ఫామ్ లలో దొర్లిన తప్పులను సవరించుకోవడానికి అవకాశం ఉండదు. ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్ 2021 మార్చి సెషన్ పరీక్షను మార్చి 15 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. అయితే NTA ఈ సమయంలో మిగతా సెషన్స్ కు సైతం అప్లై చేసుకోవడానికి లేదా విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.

First published:

Tags: CBSE, CBSE Board Exams 2021, Exams

ఉత్తమ కథలు