హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CTET 2021 : సీటెట్‌-2021 అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. న‌మూనా ప్ర‌శ్నాప‌త్రం విడుద‌ల‌

CTET 2021 : సీటెట్‌-2021 అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. న‌మూనా ప్ర‌శ్నాప‌త్రం విడుద‌ల‌

సీటెట్-2021

సీటెట్-2021

CTET-2021: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసే అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్. ఈ ప‌రీక్ష నిర్వ‌హించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education ) అభ్య‌ర్థుల కోసం సీటెట్‌-2021 (CTET-2021) న‌మూన ప‌రీక్ష ప‌త్రాన్న విడుద‌ల చేసింది.

ఇంకా చదవండి ...

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teacher Eligibility Test) రాసే అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్. ఈ ప‌రీక్ష నిర్వ‌హించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education ) అభ్య‌ర్థుల కోసం సీటెట్‌-2021 (CTET-2021) న‌మూన ప‌రీక్ష ప‌త్రాన్న విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష ప‌త్రాల‌ను సీటెట్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in నుంచి అభ్య‌ర్థులు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ ఏడాది సీబీఎస్ఈ మొద‌టి సారి సీటెట్‌ను ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించ‌నుంది. కావును అభ్య‌ర్థుల సౌక‌ర్యం కోసం న‌మూనా ప్ర‌శ్నాప‌త్రాన్నిసీబీఎస్ఈ (CBSE) విడుద‌ల చేసింది. అభ్యర్థులు నమూనా CTET ప్రశ్నపత్రం నుంచి ప్రాక్టీస్ చేయవచ్చు. కొత్త CTET పరీక్షా విధానంతో అభ్యర్థులను పరిచయం చేయడానికి, CBSE నమూనా ప్రశ్నపత్రాన్ని అందించింది.

సీటెట్ (CTET) నమూనా పేపర్‌లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ (MCQ) ఫార్మాట్‌లో ఉంటుంది. ప్ర‌శ్నాప‌త్రంలో పసుపు రంగులో సరైన సమాధానంతో కూడిన ప్రశ్నలు ఉంటాయి. CTET 2021 సిలబస్‌, ప‌రీక్షా సరళిని బాగా అర్థం చేసుకోవడానికి అభ్యర్థులు నమూనా పేపర్‌ను ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని బోర్డు స‌భ్యులు చెబుతున్నారు.

CTET నమూనా ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ చేసుకొనే విధానం

Step 1: ముందుగా అధికారిక వెబ్‌సైను సందర్శించాలి - ctet.nic.in

Step 2: వెబ్‌సైట్‌లో హోమ్‌పేజీలో, CTET sample question paper 2021ను లింక్‌పై క్లిక్ చేయండి

Step 3: CTET నమూనా ప్రశ్నపత్రం PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది.

NEET Cheating Scam: నీట్‌-2021 స్కామ్‌లో 25 మంది విద్యార్థుల గుర్తింపు.. వారి ఫ‌లితాలు నిలివేయాల‌ని ఎన్‌టీఏను కోరిన పోలీసులు


Step 4: అనంత‌రం CTET ప్రశ్నాపత్రం PDFని డౌన్‌లోడ్ చేసుకోండి.

సీటెట్ ప్ర‌శ్నాప‌త్రం కోసం డైరెక్ట్ లింక్

https://ctet.nic.in/webinfo/File/ViewFile?FileId=200&LangId=P

సీటెట్ ఎందుకు..

ఎగ్జామ్ పేపర్- 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల(Students)కు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్- 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -2 రాయాలి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది.

పేపర్ 1 విద్యార్హత- పేపర్ -1 రాయాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (Diploma In Education) చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.

పేపర్ 2 విద్యార్హత- డిగ్రీతో పాటు రెండేళ్లు ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. డిగ్రీతో పాటు ఏడాది బీఈడీ చదవాలి. 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.

First published:

Tags: Aim teacher, Career and Courses, CBSE, EDUCATION, Exams

ఉత్తమ కథలు