• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • CBSE RELEASED THE RESULT FOR THE CENTRAL TEACHER ELIGIBILITY TEST CTET NS

ఆ అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

ఆ అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

CBSE CTET Result 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. సెట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET) ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. సెట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET) ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సీటెట్(CTET 2021) పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ctet.nic.in వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే ఈ పరీక్ష పేపర్ 1కు 16,11,423 మంది రిజిస్టర్ చేసుకోగా 12,47,217 మంది హాజరయ్యారు. ఇందులో 4,14,798 మంది అర్హత సాధించారని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. పేపర్ 2 విషయానికి వస్తే మొత్తం 14,47,551 మంది రిజిస్టర్ చేసుకోగా 11,04,454 మంది అర్హత సాధించారు. ఇందులో 2,39,501 మంది అర్హత సాధించారు.

    ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే..
    అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ctet.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
    అనంతరం "CTET January 2021 results" లింక్ పై క్లిక్ చేయాలి.
    -అనంతరం రోల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
    -అనంతరం మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
    CTET 2021 Result - Direct Link
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు