CBSE : పీడ‌బ్ల్యూడీ విద్యార్థుల‌కు ప్ర‌త్యేకం.. బోర్డు ప‌రీక్ష లేదు సీబీఎస్ఈ స‌ర్క్యూల‌ర్‌

సీబీఎస్‌సీ

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు (Children with Special Needs) కోసం ప్ర‌త్య‌క స‌ర్క్య‌లర్ జారీ చేసింది. ఈ సర్క్యూల‌ర్‌ (Circular)ను అక్టోబర్ 7, 2021న జారీ చేసింది. ఈ సర్క్యూల‌ర్ మెంట‌ల్ డిసెబిలిటీ ఉన్న అర్హ‌త ఉన్న విద్యార్థులు 10,12 బోర్డు ప‌రీక్ష‌ల నుంచి మిన‌హాయింపు ఉంటుంది.

  • Share this:
    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు (Children with Special Needs) కోసం ప్ర‌త్య‌క స‌ర్క్య‌లర్ జారీ చేసింది. ఈ స‌ర్క్యూల‌ర్‌ (Circular)ను అక్టోబర్ 7, 2021న జారీ చేసింది. ఇది ఫిబ్ర‌వ‌రి 14, 2020న జారీ చేసిన స‌ర్క్యూల‌ర్‌కి కొన‌సాగింప‌ని సీబీఎస్ఈ తెలిపింది. CBSE తన సర్క్యులర్‌లో బోర్డ్ పూర్తిగా వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలుకు పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది. డిపార‌ట్‌మెంట్ ఆఫ్ సోష‌ల్ జ‌స్టిస్ అండ్ ఎంప‌వ‌ర్‌మెంట్ అండ్ డిపార్ట‌మెంట్ ఆఫ్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప‌ర్స‌న్స్ విత్ డిసెబిలిటీ విభాగాల నియ‌మాల‌ను బోర్డు పాటిస్తుంద‌ని పేర్కొంది. ఈ స‌ర్క్యూల‌ర్‌ ప్ర‌కారం.. సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలు పిల్లల మానసిక అనారోగ్యం మరియు మేధో వైకల్యాన్ని కొలిచేందుకు కొన్ని నియ‌మాలు పాటించాలని ఆదేశించింది.

    వికలాంగుల హక్కు చట్టం 2016 ప్రకారం బెంచ్‌మార్క్ (Bench Mark) వైకల్యాలున్న వ్యక్తుల‌ను మెడికల్ సర్టిఫికేట్‌లను సమర్పించి వారి డిసెబిలిటీ స్థాయిని పేర్కొనమని కోరింది. ఆ స్థాయి ఉన్న విద్యార్థుల‌కు 10వ త‌ర‌గ‌తి 12 తరగతుల బోర్డ్ పరీక్షలతో పాటు 12 వ తరగతి వరకు అన్ని DOE పరీక్షల నుంచి మినహాయింపులు ఇవ్వబడతాయి.

    TCS Openings : ఫ్రెషర్స్​కు టీసీఎస్ గుడ్​న్యూస్​.. 77 వేల మంది నియామకానికి సన్నాహాలు


    వికలాంగుల హక్కుల చట్టం, 2016 ప్రకారం దాని విద్యార్థుల హక్కులు అవ‌సరాల‌ను బోర్డు కాపాడుతుంద‌ని తెలిపింది.

    పాఠశాలలు మరియు విద్యా సంస్థలు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన అన్ని సూచనలను అనుసరించాలని బోర్డు కోరింది. స‌ర్క్యూల‌ర్‌కు సంబందించి "ఏదైనా అస్పష్టత ఉన్నట్లయితే, పాఠశాలలు, విద్యార్థులు మరియు ఇతర సంబంధిత వ్యక్తులు సామాజిక న్యాయ మరియు సాధికారత మరియు డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ (Department), భారత ప్రభుత్వం జారీ చేసిన సూచనలను అనుసరించాల‌ని బోర్డు సూచించింది."

    వికలాంగుల చట్టం 2016 కింద సడలింపు, సౌకర్యాలను కోరుతున్న విద్యార్థులు, అలాగే తల్లిదండ్రులు, సంబంధిత పాఠశాలలను సంప్రదించి, దీనికి సంబంధించి అవసరమైన అన్ని సర్టిఫికెట్‌లను సమర్పించవచ్చు. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం, పిడబ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు సమానత్వం, గౌరవంగా జీవించడం మరియు ఇతరులతో సమానంగా తన స్వంత సమగ్రతకు గౌరవం పొందే హక్కును ప్రభుత్వం అందిస్తుంద‌ని బోర్డు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

    ఐపీఎస్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సీబీఎస్ఈ
    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక‌త‌పై దృష్టి పెట్టింది. సీబీఎస్ఈ దాని అనుబంధ పాఠశాలల పరీక్షలు, అఫిలియేషన్ సంబంధిత చెల్లింపుల కోసం ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సిస్టమ్ (Integrated Payment System) ను ప్రారంభించింది. దీని ద్వారా గ‌తంలో మాన్యువ‌ల్ ప‌ద్ధ‌తిలో చేసిన చెల్లింపు విధానాన్ని మార్చి వేసింది. మాన్యువ‌ల్ ప‌ద్ధ‌తిలో చెల్లింపుల ద్వారా స‌మ‌యం వృధా అవుతున్న‌ట్టు గుర్తించామ‌ని సీబీఎస్సీ అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. ప్ర‌స్తుతం సీబీఎస్సీ పాఠ‌శాల‌ల ప‌రీక్ష‌లే కాకుండా సీటెట్ వంటి పోటీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తోంది. సీబీఎస్ఈ (CBSE) ప‌రిధిలో దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది అధ్యాప‌కులు, ప‌దివేళ‌మంది ప్ర‌ధానోపాధ్యాయులు ఉన్నారు. అంతే కాకుండా ఇత‌ర సిబ్బంది ఉన్నారు. మాన్యువ‌ల్‌గా జ‌రిగే లోపాల‌ను నివారించ‌డానికే సీబీఎస్ఈ  ఈ నిర్ణ‌యం తీసుకొంది అని పేర్కొన్నారు.
    Published by:Sharath Chandra
    First published: