సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE పలు ఉద్యోగాల భర్తీ చేపట్టింది. cbse.nic.in వెబ్సైట్లో షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ సెక్రెటరీ, అనలిస్ట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది సీబీఎస్ఈ. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఖాళీల సంఖ్య, వయస్సు, ఫీజు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ముఖ్యమైన తేదీలు, నియమనిబంధనలన్నీ త్వరలో cbse.nic.in వెబ్సైట్లో వెల్లడించనుంది సీబీఎస్ఈ. అప్లికేషన్ లింక్ 2019 నవంబర్ 15న యాక్టివేట్ చేయనుంది. అంతకంటే ముందే డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతల వివరాలను డీటెయిల్డ్ నోటిఫికేషన్లో చూడొచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు 2019 డిసెంబర్ 16 చివరి తేదీ. పలు పోస్టుల భర్తీకి సీబీఎస్ఈ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Source: cbse.nic.in
CBSE Recruitment 2019: భర్తీ చేయనున్న పోస్టుల వివరాలివే...
అసిస్టెంట్ సెక్రెటరీ
అసిస్టెంట్ సెక్రెటరీ (ఐటీ)
అనలిస్ట్ (ఐటీ)
జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్
సీనియర్ అసిస్టెంట్
స్టెనోగ్రాఫర్
అకౌంటెంట్
జూనియర్ అసిస్టెంట్
జూనియర్ అకౌంటెంట్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ స్థాయి విద్యా బోర్డు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాల నిర్వహణ, నియంత్రణ లాంటి వ్యవహారాలను సీబీఎస్ఈ చూస్తుంది. భారతదేశంలోనే 20,299 పాఠశాలలున్నాయి. 28 విదేశాల్లో 220 పాఠశాలలు సీబీఎస్ఈకి అనుబంధంగా నడుస్తున్నాయి.
Abdul Kalam Birth Anniversary: మీలో స్ఫూర్తిని రగిలించే అబ్దుల్ కలాం సూక్తులు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.