Home /News /jobs /

CBSE PROMOTES ALL CLASS 1 TO 8 STUDENTS AMID CORONAVIRUS CRISIS BA

CBSE సంచలన నిర్ణయం... ఆ క్లాసుల వాళ్లంతా పాస్... పాస్.. పాస్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CBSE Exams| ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు అందర్నీ పాస్ చేసినట్టు ప్రకటించింది.

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు అందర్నీ పాస్ చేసినట్టు ప్రకటించింది. ఎలాంటి పరీక్షలు లేకుండానే వారంతా తర్వాత తరగతులకు ప్రమోట్ అయినట్టు సీబీఎస్ఈ సంచలన ప్రకటన చేసింది. 9వ తరగతి, 11వ తరగతి విద్యార్థులకు ఇప్పటి వరకు నిర్వహించిన ప్రాజెక్ట్ వర్క్, మంత్లీ టెస్టులు, టెర్మ్ ఎగ్జామ్స్, ఇతరత్రా ఇంటర్నల్ పరీక్షలు చెక్ చేసి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేస్తారు. ‘ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న అందరు విద్యార్థులు అందరినీ తర్వాత క్లాస్ / గ్రేడ్‌కు ప్రమోట్ చేస్తున్నాం. NCERTతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని CBSE ఓ ప్రకటనలో తెలిపింది.

    అంతకు ముందు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోక్రియాల్ నిషాంక్ ఓ ట్వీట్ చేశారు. సీబీఎస్ఈలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు అందర్నీ ఎలాంటి పరీక్షలు లేకుండానే పాస్ చేయాలని సూచించినట్టు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈసారి ప్రమోట్ కాని వారు స్కూల్ నిర్వహించే ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ పరీక్షకు అటెండవ్వాలని సూచించారు.



    ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బోడర్డులు 1 నుంచి 8 వతరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పాస్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సీబీఎస్ఈ నుంచి ప్రకటన వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: CBSE, Exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు