విద్యార్థులకు గుడ్ న్యూస్.. సీబీఎస్ఈ కీలక నిర్ణయం..

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విద్యా సంవత్సరం 2020-21కి సంబంధించి 33 శాతం సిలబస్‌ను తగ్గించేలా ప్రణాళికలు సిద్దం చేయాలని నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: June 29, 2020, 2:37 PM IST
విద్యార్థులకు గుడ్ న్యూస్.. సీబీఎస్ఈ కీలక నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజూకీ పెరుగుతోంది. ఈ వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా అన్నిరంగాలపై ప్రభావం పడింది. ప్రధానంగా విద్యా సంవత్సరానికి కీలకంగా ఉండే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో లాక్‌డౌన్ విధించిన కారణంగా వార్షిక పరీక్షలు, ప్రవేశ పరీక్షలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఇప్పటికే ప్రారంభం కావాల్సిన 2020-21 విద్యా సంవత్సరం ఇంకా మొదలు కానేలేదు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విద్యా సంవత్సరం 2020-21కి సంబంధించి 33 శాతం సిలబస్‌ను తగ్గించేలా ప్రణాళికలు సిద్దం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలే సిలబస్‌ను తగ్గించవచ్చని పేర్కొంది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తగ్గించిన సిలబస్‌‌కు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే సీబీఎస్ఈ విడుదల చేయనుంది.

సిలబస్ మాత్రమే కాకుండా క్వశ్చన్ పేపర్‌లో కూడా 50 శాతం మల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలను ఇవ్వాలని, మిగిలిన థియరీ బేస్డ్ ఉంచాలని ఆలోచించింది. వీటితో పాటుగా విద్యార్థులకు ఇంటి వద్ద నుంచే ప్రాక్టికల్స్ నిర్వహించేలా మార్పులు చేసేందుకు సీబీఎస్ఈ సిద్ధమయ్యింది.

అయితే ఇందుకోసం పాఠశాలల యాజమాన్యాలు డిజిటల్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. కాగా 10, 12వ తరగతుల సీబీఎస్ఈ బోర్డు పరీక్షా ఫలితాలు జూలై 15న విడుదల చేసే అవకాశం ఉంది.
First published: June 29, 2020, 2:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading