హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE సిలబస్ లో మార్పులు.. కొత్తగా కోడింగ్, డేటా సైన్స్ సబ్జెక్టులు.. వివరాలివే

CBSE సిలబస్ లో మార్పులు.. కొత్తగా కోడింగ్, డేటా సైన్స్ సబ్జెక్టులు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్ఈ సిలబస్ లో ఈ విద్యా సంవత్సరం నుంచి మార్పులు చోటు చేసుకోనున్నాయి. బోర్డు కొత్తగా కోడింగ్, డేటా సైన్స్ సబ్జెక్టులను మైక్రోసాఫ్ట్ సహకారంతో ప్రవేశపెట్టనుంది.

సీబీఎస్ఈ బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి పలు తరగతుల సిలబస్ లో కోడింగ్‌, డేటా సైన్స్ స‌బ్జెక్ట్‌లను చేర్చుతూ నిర్ణయం తీసుకుంది సీబీఎస్ఈ. ఇందుకోసం బోర్డు ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థుల్లో ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివిటీ తదితర నైపుణ్యాలు పెంచేందుకు ఈ సబ్జెక్టులు ఉపయోగపడతాయని సీబీఎస్ఈ భావిస్తోంది. 2020 నూత‌న జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది సీబీఎస్ఈ. ఈ విషయంపై సీబీఎస్ఈ బోర్డు మనోజ్ అహుజా మాట్లాడుతూ.. సీబీఎస్ఈ ఆరు నుంచి ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్థులకు కోడింగ్, ఎనిమిది నుంచి 12వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు డేటా సైన్స్ సబ్జెక్టులు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకుని మైక్సోసాఫ్ట్ సంస్థ సహకారంతో కోడింగ్‌, డేటా సైన్స్ కోర్సుల‌ను రూపొందించినట్లు వెల్లడించారు.

NEET UG 2021: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే

ఈ కొత్త కోర్సులు విద్యార్థుల్లో ప్రాబ్లం సాల్వింగ్ తో పాటు సృజనాత్మకతను పెంపొందిస్తాయని ఆయన వెల్లడించారు. ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ స్పందించారు. జాతీయ విద్యా విధానం కింద తాము కోడింగ్, డేటా సైన్స్ సబ్జెక్టులను పాఠశాల విద్యలో ప్రవేశ పెడతామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఈ విద్యాసంవత్సరంలో సీబీఎస్ఈ ఆ హామీ అమలుకు సిద్ధమవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించిన కేంద్రం.. నిర్ణీత సమయంలో 12వ తరగతి విద్యార్థులకు ఫలితాలు అందించాలని భావిస్తోంది. అయితే ఏ ప్రాతిపదికన వారికి మార్కులు ఇవ్వాలనే దానిపై ప్రతిపాదనలు ఇచ్చేందుకు సీబీఎస్ఈ బోర్డు ఓ అత్యున్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పది రోజుల్లో తమ రిపోర్టును సీబీఎస్ఈకు ఇవ్వనుంది. ఈ బోర్డులో కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ విపిన్ కుమార్ సహా 12 మంది ఉన్నారు. పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న క్రమంలోనే ఫలితాలను సరైన పద్ధతిలో రూపొందించాలని సీబీఎస్ఈని ప్రధాని మోదీ ఆదేశించారు.

First published:

Tags: CBSE, CBSE Board Exams 2021

ఉత్తమ కథలు