CBSE : ఇక డిజిట‌ల్ చెల్లింపు విధానం.. ఐపీఎస్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సీబీఎస్‌సీ

సీబీఎస్‌సీ

CBSE : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక‌త‌పై దృష్టి పెట్టింది. సీబీఎస్సీ దాని అనుబంధ పాఠశాలల పరీక్షలు, అఫిలియేషన్ సంబంధిత చెల్లింపుల కోసం ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సిస్టమ్ (Integrated Payment System) ను ప్రారంభించింది.

 • Share this:
  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక‌త‌పై దృష్టి పెట్టింది. సీబీఎస్సీ దాని అనుబంధ పాఠశాలల పరీక్షలు, అఫిలియేషన్ సంబంధిత చెల్లింపుల కోసం ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సిస్టమ్ (Integrated Payment System) ను ప్రారంభించింది. దీని ద్వారా గ‌తంలో మాన్యువ‌ల్ ప‌ద్ధ‌తిలో చేసిన చెల్లింపు విధానాన్ని మార్చి వేసింది సీబీఎస్ఈ. మాన్యువ‌ల్ ప‌ద్ధ‌తిలో చెల్లింపుల ద్వారా స‌మ‌యం వృధా అవుతున్న‌ట్టు గుర్తించామ‌ని సీబీఎస్సీ అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. ప్ర‌స్తుతం సీబీఎస్సీ పాఠ‌శాల‌ల ప‌రీక్ష‌లే కాకుండా సీటెట్ వంటి పోటీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తోంది. సీబీఎస్‌సీ ప‌రిధిలో దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది అధ్యాప‌కులు, ప‌దివేళ‌మంది ప్ర‌ధానోపాధ్యాయులు ఉన్నారు. అంతే కాకుండా ఇత‌ర సిబ్బంది ఉన్నారు. మాన్యువ‌ల్‌గా జ‌రిగే లోపాల‌ను నివారించ‌డానికే సీబీఎస్‌సీ ఈ నిర్ణ‌యం తీసుకొంది అని పేర్కొన్నారు.

  సాధార‌ణ ప‌ద్ధ‌తిలో ఫీజుల చెల్లింపు ప్ర‌క్రియ పూర్తికావ‌డానికి ఆరు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఎందుకంటే "అధికారుల ద్వారా అనేక మాన్యువల్ చెక్కుల ద్వారా పాస్ అవుతుంది." పరీక్ష విధుల కోసం, తనిఖీ ప్రక్రియ ముగిసిన తర్వాత, CBSE కేంద్ర సూపరింటెండెంట్‌లకు డబ్బు పంపిణీ చేస్తుంది.

  TCS Openings : ఫ్రెషర్స్​కు టీసీఎస్ గుడ్​న్యూస్​.. 77 వేల మంది నియామకానికి సన్నాహాలు​


  వివిధ కార్యనిర్వాహకులకు చెల్లింపులను మరింతగా పంపిణీ చేస్తుంది. అఫిలియేషన్ ప్రయోజనాల కోసం, బోర్డు అటువంటి మాన్యువల్ చెక్కుల తర్వాత ప్రిన్సిపాల్‌లు మరియు విద్యా నిర్వాహకులకు చెల్లిస్తుంది. ఇన్ని ద‌శ‌ల కార‌ణంగా ప్ర‌క్రియ బాగా ఆల‌స్యం అవుతుంది.

  ఈ కొత్త విధానంపై సీబీఎస్‌సీ అధికారిక ప్ర‌క‌ట‌న ఇచ్చింది. “ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సిస్టమ్ (IPS) ద్వారా చెల్లింపుల‌ను వేగ‌వంతం చేయ‌డంతోపాటు విశ్వ‌స‌నీయ‌త పెరుగుతుంద‌ని పేర్కొంది. క‌రోనా అనంత‌రం డిజిట‌ల్ గ‌వ‌ర్నెన్స్ తోడ్పాటుకు ఈ నిర్ణ‌యం ఉప‌క‌రిస్తుంద‌ని సీబీఎస్‌సీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ వ్య‌వ‌స్థ ద్వారా మాన్యువ‌ల్ త‌ప్పిదాల‌కు ఆస్కారం త‌గ్గుతుంద‌ని తెలిపింది.

  IBPS Clerk 2021 : ఇలా చేస్తే బ్యాంక్ కొలువు మీదే.. ఐబీపీఎస్ ప్రిప‌రేష‌న్ ప్లాన్‌


  ఐపీఎస్ విధానం ద్వారా పూర్తి డిజిట‌ల్ చెల్లింపు ఉటుంది. దీని ద్వారా మాన్యువ‌ల్ జోక్యం ఉండ‌దు. సీబీఎస్‌సీ విధులు నిర్వ‌హించిన సిబ్బందికి, పాఠ‌శాల‌లు త‌నిఖీ చేసిన వారికి గౌర‌వ వేత‌నం కూడా ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తారు. అంతే కాకుండా వారీ TA/DAలుకూడా ఉద్దేశించిన చెల్లింపుదారుడికి నేరుగా బ్యాంక్ బదిలీ అయ్యేలా ఏర్పాటు చేశారు.

  న‌వంబర్‌లో సీబీఎస్​ఈ టర్మ్ 1 పరీక్షలు..
  విద్యా విధానంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. నూతన విద్యా విధానానికి అనుగుణంగా సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా 2021–22 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్​ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను సెమిస్టర్​ విధానంలో జరపాలని నిర్ణయించింది. అంటే ఈ పరీక్షలకు సంవత్సరానికి రెండుసార్లు జరగనున్నాయి. ప్రతి టర్మ్​ 50 శాతం సిలబస్ కవర్​ చేస్తుంది. టర్మ్​1 పరీక్షలు నవంబర్​లో, టర్మ్​ 2 పరీక్షలు మార్చి–ఏప్రిల్​ నెలల్లో జరగనున్నాయి. దీంతో సీబీఎస్​ఈ 10వ, 12వ తరగతి విద్యార్థులు వచ్చే నెలలో జరగనున్న టర్మ్ 1 పరీక్షల షెడ్యూల్​ కోసం ఎదురు చూస్తున్నారు.
  Published by:Sharath Chandra
  First published: